వాళ్లకీ మళ్లీ ఛాన్స్....

  • IndiaGlitz, [Monday,June 30 2014]

సినిమా పరిశ్రమలో హీరో హీరోయిన్స్ కి ప్రత్యేకస్థానం ఉన్నా హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ కి లైఫ్ టైమ్ తక్కువ. ఈ విషయాన్ని నొక్కి వక్కాణించనక్కర్లేదు. ఎందుకంటే ఒక స్టార్ పక్కన హీరోయిన్ గా నటించిన హీరోయిన్ కొన్ని సంవత్సరాలు తర్వాత ఆటోమేటిగ్గా ఫేడవుట్ అవుతుంది. పెళ్లయినా, కాకపోయినా కొన్నేళ్లు సినిమాల్లేక తటపటాయిస్తే హీరోయిన్ కెరీర్ ను కోల్పోయినట్టే. ఒకవేళ కనిపించినా ఎక్కడో ఓ ఐటమ్ సాంగ్ లోనో, అతిథి పాత్రలతోనే సరిపెట్టుకోవాల్సిందే. కానీ ఇప్పుడు కాలచక్రం గిర్రున తిరుగుతోంది. ఒకప్పుడు వద్దనుకున్న వారిని వెతుక్కుంటూ వెళ్లడం కనిపిస్తోంది. హీరోయిన్లకు పనికిరారనుకున్నవారు ఇప్పుడు పనికొస్తున్నారు. ఒకప్పుడు వద్దనుకుని పక్కన పెట్టేసిన పరిశ్రమే వాళ్లని వెతుక్కుంటూ అవకాశాలు కల్పిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోయిన్ గానే అవకాశం కల్పిస్తోంది. అలాంటి వారి సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఓ లుక్కేద్దాం...

శ్రియ

దక్షిణాదిన టాప్ స్టార్స్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ ఢిల్లీ డాల్ ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో చిందేసిన ఈ చిన్నది, ఒకానొక దశలో సినిమాలు లేక ఫేడవుట్ అయిపోయింది. అడపా దడపా ఐటెం సాంగ్స్, చిన్న రోల్స్ లో కనువిందు చేసినా, స్టార్ హీరోల సరసన అవకాశాలు సన్నగిల్లాయి. కానీ చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ తెరపై మళ్లీ మనం' సినిమాతో మెరుపులా మెరిసింది. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో విక్&