హైదరాబాద్‌లో ఒకే స్కూలులోని 38 మంది విద్యార్థినులకు కరోనా

  • IndiaGlitz, [Wednesday,March 17 2021]

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా పాఠశాలల్లో ఈ మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తోంది. కరోనా సమయంలో పాఠశాలలు తెరవడం.. చిన్నారులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో అదుపులోకి వచ్చిందనుకున్న కరోనా మరోసారి విజృంభిస్తోంది. మంగళవారం హైదరాబాద్ శివారు నాగోల్‌లోని బండ్లగూడలో కరోనా కల్లోలం రేపింది. బాలికల మైనార్టీ పాఠశాలలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 38 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఈ పాఠశాలలో మొత్తం 160 మంది విద్యార్థినులు చదువుతున్నారు.

వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యార్థినులు, సిబ్బంది అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసులు పెరిగితే అందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు కరోనా అదుపులోకి వచ్చేసిందనుకున్న అనంతరం రోజు రోజుకూ గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా కేసులు పెరుగుతుండటం గమనార్హం. కాగా.. సోమవారం కరీంనగర్‌లో సైతం నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే మంచిర్యాలలో 15 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హాస్టల్ వార్డెన్‌తో పాటు పలువురు టీచర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది.

More News

కరోనాతో షూటింగ్‌కు బిగ్‌బాస్ బ్యూటీ.. కేసు నమోదు

కరోనా వైరస్ వచ్చి ఏడాది గడిచినా దాని ప్రభావం మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ విపరీతంగా నష్టపోయింది.

బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు షాక్.. కోర్టు జరిమానా

బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఊహించని విధంగా జరిమానా విధించింది. ఇంటర్నెట్ హ్యాండిలింగ్ చార్జీల పేరుతో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు

'దృశ్యం 2' సెట్స్‌లో జాయిన్ అయిన మీనా

‘దృశ్యం’ సినిమా సింపుల్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మలయాళం రీమేక్ అయిన ఈ సినిమా.. తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కింది. థ్రిల్లర్ జోనర్‌లో ఈ చిత్రం రూపొందింది.

'స‌లార్‌'లో కేజీయ‌ఫ్ స్టార్‌..!

ఇద్ద‌రు ప్యాన్ ఇండియా స్టార్స్ క‌లిసి సినిమా చేస్తుంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఈ సినిమా కోసమే ఎదురుచూస్తుంటుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.

ప‌వ‌ర్‌స్టార్ కోసం జాన‌ప‌ద రైట‌ర్‌..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. క్రిష్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్క‌తున్న ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ సినిమాతో పాటు సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న