అత్తారింటికి దారేది @ 4

  • IndiaGlitz, [Wednesday,September 27 2017]

ఖుషి త‌రువాత స‌రైన హిట్ లేని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మ‌ళ్లీ విజ‌యాన్ని అందించింది జ‌ల్సా చిత్ర‌మే. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అలాంటి ఈ హిట్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రెండో చిత్రం అత్తారింటికి దారేది.. బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసుకుంది. విడుద‌ల‌కి ముందే సినిమా లీక్ అయినా.. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి న‌చ్చే కంటెంట్ ఉండ‌డం సినిమాకి ప్ల‌స్ అయ్యింది. అదే ఈ సినిమాన్ని ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిపింది.

జ‌ల్సాకి అద‌ర‌గొట్టే ఆడియో ఇచ్చిన‌ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకి కూడా మంచి బాణీలు ఇచ్చారు. ప‌లు అవార్డుల‌తో పాటు తొలిసారిగా నంది అవార్డుని కూడా త‌న సంగీతానికి సొంతం చేసుకున్నారాయ‌న‌. స‌మంత‌, ప్ర‌ణీత క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ సినిమాలో ప‌వ‌న్‌కి అత్త‌గా న‌దియా న‌టించ‌గా.. ఇత‌ర పాత్ర‌ల్లో బొమ‌న్ ఇరాని, ముఖేష్ రుషి, అలీ, బ్ర‌హ్మానందం, రావు రమేష్ త‌దిత‌రులు న‌టించారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27, 2013న విడుద‌లైంది. అంటే.. నేటితో ఈ సినిమా నాలుగు సంవ‌త్స‌రాల‌ను పూర్తిచేసుకుంటోంద‌న్న‌మాట‌.

More News

అక్టోబర్ లో 'ఓయ్.. నిన్నే'

మన సంతోషానికి దగ్గరగా ఉన్నప్పుడే మనం సుఖంగా ఉంటామని నమ్మే ఓ కుర్రాడు విష్ణు.

'స్పైడర్ ' లో ఆడియెన్స్ కోరుకునే ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి - సూపర్ స్టార్ మహేష్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా,రకుల్ ప్రీత్ హీరోయిన్ గా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నాట్స్ 2019 సభ్యత్వ నమోదు ..

ఉత్తర అమెరికా ,వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు చేయూతనిస్తోంది.

విక్రమ్ , సమంత '10' ఫస్ట్ లుక్ విడుదల

శివపుత్రుడు,అపరిచితుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సెన్సేషనల్ స్టార్ చియాన్ విక్రమ్

రకుల్ రేంజ్ పెరుగుతోంది

మూడేళ్ల క్రితం వ‌ర‌కు ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ సాదాసీదా హీరోయిన్‌. అయితే ఆమె ద‌శ‌ని, దిశ‌ని.. స‌రిగ్గా మూడేళ్ల క్రితం ఇదే తేది మార్చేసింది. 2014, సెప్టెంబ‌ర్ 26న విడుద‌లైన లౌక్యంతో ర‌కుల్ జాత‌క‌మే మారిపోయింది.