4డీ ట‌క్నాల‌జీ.. 120 కెమెరాలు..

  • IndiaGlitz, [Thursday,November 22 2018]

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్‌'. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. రీసెంట్‌గా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా స్టార్ట‌య్యింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని 4డీ టెక్నాల‌జీతో తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌.

'2.0' కంటే బెట‌ర్ క్వాలిటీతో సినిమాను నిర్మిస్తున్నార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు. యాక్ష‌న్ ఎపిసోడ్స్ కోసం 120 కెమెరాల‌ను వాడుతున్నార‌ట‌. 4డీ టెక్నాల‌జీతో తెర‌కెక్క‌బోయే తొలి చిత్ర‌మిదే అవుతుంది. తార‌క్‌, చెర్రీ సినిమా అంటే ఎన్ని అంచ‌నాలుంటాయో తెలిసిందే. కాబ‌ట్టి ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా సినిమాను నిర్మిస్తున్నాడ‌ట నిర్మాత డి.వి.వి.దాన‌య్య‌.