Hair Robbing:ఎంతకి తెగించార్రా.. గుజరాత్‌లో రెండు బస్తాల వెంట్రుకలు చోరీ, అంత విలువా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎక్కడైనా దొంగలంటే డబ్బు, బంగారం ఇతర విలువైన వస్తువులను దోచుకుంటారు. ఇందుకోసం అడ్డొచ్చిన వాళ్లని సైతం దారుణంగా హతమారుస్తారు. కానీ గుజరాత్‌లో విచిత్ర సంఘటన జరిగింది. దొంగలు తల వెంట్రుకలను దొంగతనం చేశారు. వినడానికే ఆశ్చర్యంగా వుంది కదూ. వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్ శివార్లలోని పిప్లియా ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి రెండు బస్తాల వెంట్రుకలను తన బైక్‌పై పెట్టుకుని మోర్బీ అనే ప్రాంతానికి వెళ్తున్నాడు. ఈ రెండు బస్తాల్లో 40 కిలోల బరువున్న వెంట్రుకలు వున్నాయి.
గంటల వ్యవధిలో దొంగలను పట్టుకున్న పోలీసులు :
ఈ క్రమంలో ముగ్గురు దుండగులు ఆటోలో వచ్చి బాధితుడిని అడ్డగించి అతని దగ్గర వున్న బస్తాలను దోచుకెళ్లారు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు దొంగలను పట్టుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి వెంట్రుకల బస్తాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రోహిత్, రవి, రాహుల్, పురుషోత్తం భాయ్, లాల్జీ చౌహాన్‌లుగా గుర్తించారు. ఈ వెంట్రుకల విలువ రూ.2 లక్షలు వుంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఐదుగురికి గతంలో నేరం చేసిన చరిత్ర వుందని వెల్లడించారు.
జుట్టుకు విపరీతమైన గిరాకీ :
రకరకాల కారణాలతో మహిళల జుట్టు ఊడిపోతుంది. ఆ వెంట్రుకలను కొందరు రకరకాల మార్గాల్లో ప్రజల నుంచి కొనుగోలు చేస్తారు. ఇలా సేకరించిన జుట్టును సవరాలు, విగ్గులు తయారు చేసేందుకు వినియోగిస్తున్నారు. ఆధునికకాలంలో జుట్టు ఊడిపోవడం, చిన్న వయసులోనే బట్టతల వంటి కారణాలతో విగ్గులకు చాలా డిమాండ్ వుంది. ఈ నేపథ్యంలోనే వెంట్రుకలను సేకరించేవారు కూడా పెరుగుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments