గూగుల్ ప్లే స్టోర్ నుంచి 600 యాప్‌లు తొలగింపు!

  • IndiaGlitz, [Saturday,February 22 2020]

అవును మీరు వింటున్నది నిజమే.. ఒకట్రెండు కాదు ఏకంగా 600 మంది యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి తొలగించడం జరిగింది. అనుచిత ప్రకటనలతో వినియోగదారులకు చికాకు తెప్పిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను వినియోగిస్తున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా, డివైజ్‌ పనితీరును దెబ్బతీసేలా, అనుకోని రీతిలో తెరపై ప్రకటనలను ఇస్తున్న యాప్‌లను తొలగిస్తున్నట్లు గూగుల్‌ తెలిపింది. ఇప్పటికే దాదాపు 4.5 బిలియన్ల సార్లు ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు సమాచారం.

యాప్‌ని వినియోగించని సమయంలో, కాల్‌ చేస్తున్న సమయంలో కూడా ఇవి స్క్రీన్‌పై ప్రకటనల్ని చూపిస్తున్నట్లు గుర్తించారు. దీనివల్ల వినియోగదారుల విలువైన సమయం వృథా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వీటిని యాప్‌ నుంచి తీసేశామన్నారు. కాగా.. ఇప్పటికే సదరు యాప్‌ల ద్వారా ప్రకటనలు ఇచ్చిన కంపెనీలకు లేదా ఉత్పత్తులకు నిబంధనల ప్రకారం డబ్బులు తిరిగి చెల్లిస్తామని తెలిపారు.

More News

రోజంతా లేడీస్‌ హాస్టల్‌లో విద్యార్థి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో..!

విద్యార్థినీలు ఉన్న హాస్టల్‌లోకి బాయ్స్‌కు అనుమతి ఉండదన్న విషయం తెలిసిందే. అయితే.. అబ్బే ఈ షరతులు అందరికీ వర్తిస్తాయ్ కానీ నాకు కాదు అనుకున్నాడేమో కానీ..

త‌రుణ్ భాస్క‌ర్ షాక్‌!!

షార్ట్ ఫిలింస్ నుండి `పెళ్ళిచూపులు` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన త‌రుణ్ భాస్క‌ర్ తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని న‌మోదు చేసుకోవ‌డ‌మే కాదు..

సాయి కుమార్ చేతుల మీదుగా కాలేజ్ కుమార్ ట్రైలర్ లాంచ్ !!!

ఎమ్ ఆర్  పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్సణ లో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడ ఘన విజయం సాధించిన ఈ మూవీ ని  తెలుగు లో రిమేక్ చేసాడు

'పలాస 1978' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి .. మార్చ్ 6న విడుదల

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా  ‘‘పలాస 1978’’ .

మ‌హేశ్ సినిమా ఆగిపోయిందా?

ఈ ఏడాది సంక్రాంతికి ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ పెద్ద హిట్ సాధించాడు.