close
Choose your channels

66వ జాతీయ అవార్డులు

Friday, August 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

66వ జాతీయ అవార్డులు

కేంద్ర ప్రభుత్వం 66వ జాతీయ అవార్డులను ప్రకటించింది. శుక్రవారం ప్రకటించిన ఈ అవార్డుల్లో ఈసారి తెలుగు సినిమా వివిధ విభాగాల్లో ఏడు అవార్డులను సాధించడం విశేషం. ముఖ్యంగా `మహానటి` చిత్రానికి మూడు అవార్డులు రాగా. .కీర్తి సురేశ్ ఏకంగా జాతీయ ఉత్తమనటి అవార్డును సొంతం చేసుకుంది. చి.ల.సౌ చిత్రానికి 1 అవార్డ్, అ! చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి.

అవార్డుల లిస్ట్:
ఉత్తమ నటుడు: ఆయుష్మాన్ ఖురానా(అందా ధూన్), విక్కీ కౌశల్(యూరి)
ఉత్తమ నటి: కీర్తి సురేశ్(మహానటి)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్(యూరి)
ఉత్తమ చిత్రం: హోల్లారో(గుజరాతీ)
ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపథ్య చిత్రం: పానీ(మరాఠీ)
ఉత్తమ సహాయనటుడు: స్వానంద్ కిర్‌కిరే(చంబక్)
ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ(బదాయి హో)
ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయి హో
ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్ రెడ్డి యాకంటి(నాల్, మరాఠీ)
ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం(రాధా క‌ృష్ణన్)
ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్
సంగీత దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)
ఉత్తమ యాక్షన్ చిత్రం: కె.జి.యఫ్ చాప్టర్ 1
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్: అ!, కె.జి.యఫ్ చాప్టర్ 1
ఉత్తమ సౌండ్ డిజైనింగ్: యూరి
ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్ మ్యాన్
ఉత్తమ మేకప్: అ!
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: మహానటి
ఉత్తమ సాహిత్యం: నాతి చరామి(కన్నడ)
నర్గీస్ దత్ అవార్డ్: వండల్లా ఎరడల్లా(కన్నడ)
ఉత్తమ స్ర్రీన్‌ప్లే: చి.ల.సౌ
ఉత్తమ ఎడిటింగ్: నాతిచరామి
ఉత్తమ డైలాగ్స్: తారీఖ్(బెంగాలీ)
ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్(పద్మావత్)
ఉత్తమ గాయని: బిందు మాలిని(నాతి చరామి)
ఉత్తమ బాలనటుడు: పి.వి.రోహిత్, సాహెబ్ సింగ్, అర్షద్ రేసి, శ్రీనివాస్ షోకాలే
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: కుమార సంభవం(మలయాళం)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.