‘7’ ట్రైలర్ కిరాక్.. ఇంతకీ ఆ అమ్మాయిలను చంపిందెవరు!?

  • IndiaGlitz, [Thursday,May 09 2019]

క్రైమ్‌ థ్రిల్లర్స్‌ సంబంధించి సినిమాలను తెరకెక్కించడానికి తెలుగు డైరెక్టర్స్ ఇప్పుడు అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఇవి ఎక్కువగా తమిళ, మలయాళంలో ఉండేవి. ఇప్పటికే క్రైమ్‌ నేపథ్యంలో పలు చిత్రాలు రాగా తాజాగా ‘7’ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ట్రైలర్ రివ్యూ...

ఆరుగురు అమ్మాయిలు... ఆరు ప్రేమకథలు! ప్రతి ప్రేమ కథలోనూ అబ్బాయి ఒక్కడే! ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న అతడు మంచోడా? చెడ్డోడా? ప్రతి అమ్మాయి అతడే కావాలని ఎందుకు కోరుకుంటోంది? అనేది మంచి ఇంట్రస్టింగ్‌గా ఉంది. హీరో హవీష్ ప్రేమించిన ఆ అమ్మాయిలు వరుసగా హత్యకు గురవటం, వాటికి కారణాలు ఏంటో తెలియకపోవడం, కార్తీక్‌ అనే కుర్రాడే ఈ హత్యలు చేశాడని పోలీసులు అనుమానించడంతో మున్ముంథు ఏమేం జరగబోతోంది..? అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి..? అనేది ట్విస్ట్. ఈ ట్విస్ట్‌ ఏంటో తెలుసుకోవడానికి జనాలు కచ్చితంగా థియేటర్లకు క్యూ కడతారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు వరుస హత్యలకు సంబంధించి ఈ కేసులను చేదించడం.. ఈ క్రమంలో ఒకేలా ఇద్దరు ఉన్నారా? ఇలా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉందని చెప్పుకోవచ్చు. సింగిల్ ట్రైలర్‌లోనే ప్రేక్షకుల ఊహలకు అందని మలుపులతో కథనం సాగుతోందని తెలిసిపోయింది. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ట్విస్ట్ వెనుక కథలో భాగంగా ఎమోషనల్ లవ్ స్టోరీ ఉండటం మరో ట్విస్ట్. ఇవన్నీ అటుంచితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్.. బహుశా సినిమాకు ఇదే ప్లస్ పాయింట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.

కాగా.. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. జూన్‌ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి.. ‘కల్కి’ ట్రైలర్ రివ్యూ

యాంగ్రీ స్టార్ రాజశేఖర్‌, ఆదాశర్మ, నందిత శ్వేత నటీనటులుగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి’.

టీవీ9 వివాదం వెనుక ఉన్నదెవరు..? రవిప్రకాష్ బాగోతం బట్టబయలు!!

టీవీ9 సీఈవో వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

ఫోర్జరీ వివాదంపై క్లారిటీ.. తోటి చానెళ్లకు గడ్డిపెట్టిన టీవీ9 రవిప్రకాష్!!

టీవీ9 సీఈవో రవిప్రకాష్‌లో సంతకం ఫోర్జరీ కేసు నమోదైందని.. ఆయన రెండ్రోజులుగా పరారయ్యారని పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారని వార్తలు పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే.

ఏపీలో గెలుపెవరిదో తేల్చేసిన లక్ష్మీపార్వతి

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు తెరెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఇంకా ఏపీలో విడుదల కాలేదు.

గుణ టైటిల్ వివాదం

క‌ళాధ‌ర్ కొక్కొండ  న‌టిస్తూ ,   స్వీయ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న  చిత్రం గుణ‌. న‌టులు సెల్వ‌రాజ్ , దిల్ ర‌మేష్  ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు.. స‌నాతన క్రియేష‌న్స్ బ్యాన‌ర్