close
Choose your channels

గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా తెలుగు రాష్ట్రాల శకటాలు!

Sunday, January 26, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా తెలుగు రాష్ట్రాల శకటాలు!

యావత్ భారత్ దేశ వ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని రాజ్పథ్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్జాతీయ జెండాను ఆవిష్కరించి.. గౌరవ వందనం స్వీకరించారు. కాగా.. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్బోల్సొనారో హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేత అడ్వాణీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, గులామ్నబీ ఆజాద్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ పార్టీల అగ్రనేతలు గణతంత్ర దినోత్సవంలో పాలొన్నారు. మరోవైపు ఈ వేడుకను తిలకించడానికి వేలాది మంది ప్రజలు రాజ్పథ్‌కు తరలి వచ్చారు.

మొత్తం 22 శకటాలు!

ఈ సందర్భంగా.. దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెబుతూ సైనికులు భారీ కవాతు నిర్వహిస్తూ.. త్రివర్ణ జెండాకు వందనం చేస్తూ ముందుకు సాగారు. రాష్ట్రపతికి వజ్ర, భీష్మ యుద్ధ ట్యాంకులు గౌరవ వందనం సమర్పించాయి. కాగా.. శకటాలు, నృత్యాలు, భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆయా ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పాయి. మొత్తం 22 శకటాలు రాజ్పథ్‌లో సందడి చేశాయి. వివిధ సంస్కృతులకు చెందిన వారు నృత్యాలు చేస్తూ అలరించారు. వీటిని చూసి బ్రెజిల్ అధ్యక్షుడు మంత్రముగ్ధులయ్యారు.

బతుకమ్మ, వేయి స్థంబాలు గుడితో..!

ఈ వేడుకల్లో తెలంగాణకు చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బతుకమ్మ, వేయి స్థంబాల గుడి, లంబాడీల నృత్యాలు సంస్కృతిని గొప్పతనాన్ని చాటాయి. శకటం ప్రదర్శిస్తున్న టైమ్‌లో ‘బతుకమ్మ పాట’, ‘సమ్మక్క-సారాలమ్మ’ అంటూ పాటలకు లంబాడీలు చేసిన నృత్యానికి వీక్షకులు పరవశింపజేశాయి.

ఏడుకొండల వెంకన్న..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వ కళారూపాలు, ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ ఉన్న శకటం కూడా ప్రత్యేక ఆకర్షణీయంగా కనువిందు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం, బ్రహ్మోత్సవాలు, కూచిపూడి నృత్యాలు, ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు, సహజరంగుల కలంకారీ అద్దకాలతో కూడిన ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవం అనే పాటకు కళాకారులు నృత్యం చేస్తూ కనువిందు చేశారు. ఆ నృత్యానికి వీక్షకులు కరచాల ధ్వనులతో హోరెత్తించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.