ఏపీలో నేడు 793 పాజిటివ్ కేసులు..

  • IndiaGlitz, [Monday,June 29 2020]

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏపీ కరోనా బులిటెన్ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ 793 కరోనా కేసుల్లో 706 కేసులు ఏపీకి చెందినవి కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 81 మంది.. విదేశాల నుంచి వచ్చిన ఆరుగురు కరోనా బారిన పడ్డారు. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13891కి చేరుకుంది.

కాగా.. ప్రస్తుతం 7479 మంది కరోనాకు చికిత్స తీసుకుంటుండగా.. 6232 మంది డిశ్చార్జ్ అయ్యారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా 11 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 180కి చేరుకుంది. మృతుల్లో కర్నూలుకు చెందిన వారు ఐదుగురు, కృష్ణా 2, నెల్లూరు 2, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున ఉన్నారు.

More News

పోలీసులపైకి కుక్కలను వదిలిన పీవీపీ

నేడు వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ)ని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపైకి కుక్కలను వదలడం సంచలనంగా మారింది.

తెలంగాణలో సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణలో సచివాలయం కూల్చివేత వివాదంలో హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరో మార్గం లేకే మీడియా ముందుకు వెళ్లా: జగన్‌కు రఘురామ లేఖ

వైసీపీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు.. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం.. పలు సందర్భాల్లో

పవన్‌ను మరోసారి టార్గెట్ చేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక

జనసేన పార్టీ అధినేత, పార్టీపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి టార్గెట్. జనసేనను పట్టించుకునేవారే లేరని..

తెలంగాణ లొకేష‌న్స్‌పై ద‌ర్శ‌క‌ధీరుడి ఆరా!!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఈ టెన్ష‌న్‌కు కార‌ణం క‌రోనా.