20 నిమిషాల కోసం దాదాపూ రూ.8 కోట్లా?

  • IndiaGlitz, [Tuesday,January 28 2020]

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ గ‌త ఏడాది ద‌బాంగ్ 3 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఆ సినిమాను ప్ర‌భుదేవా డైరెక్ట్ చేశారు. ఇప్పుడు మూడోసారి ప్ర‌భుదేవాద‌ర్శ‌క‌త్వంలోనే స‌ల్మాన్‌ఖాన్ రాధే అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 'యువ‌ర్ మోస్ట్ వాంటెడ్ భాయి' దీనికి ఉప‌శీర్షిక‌. ఈ ఏడాది రంజాన్ సంద‌ర్భంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్ 20 నిమిషాల పాటు ఉంటుంది. దుబాయ్, స్టూడియోలో వేసే భారీ సెట్‌లో ఈ క్లైమాక్స్‌లో ప్లాన్ చేశారు.

సల్మాన్‌ఖాన్‌, ర‌ణ‌దీప్ హుడా మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశం చిత్రీక‌ర‌ణ కోసం క్రోమా కీ టెక్నాల‌జీని ఉప‌యోగించ‌బోతున్నార‌ట‌. ఈ విధానంలో బాహుబ‌లి చిత్రాన్ని మాత్ర‌మే చిత్రీక‌రించారు. ఈ స‌న్నివేశానికి దాదాపు రూ.8 కోట్లు ఖ‌ర్చు అవుతుందట‌. కానీ ఈ టెక్నాల‌జీలో చిత్రీక‌రిస్తే సీన్ ఎన్‌హెన్స్ అవుతుంద‌ని భావించిన నిర్మాత‌లు ఏమాత్రం ఆలోచించ‌కుండా ఖ‌ర్చు పెట్ట‌డానికి రెడీ అయిపోయార‌ట‌. దిశా ప‌టానీ హీరోయిన్‌గా న‌టిస్తోన్నఈ చిత్రంలో జాక్వ‌లైన్ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇక జాకీష్రాఫ్‌, త‌మిళ న‌టుడు భ‌ర‌త్ త‌దితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More News

వివేకా హత్యకేసులో షాకింగ్ ట్విస్ట్.. పేర్లు బయటికొచ్చాయ్!!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో మరో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. ఇప్పటికే ఈ కేసు విషయంలో పలువుర్ని పోలీసులు, కోర్టులు విచారించిన

టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు కన్నుమూత

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ రచయిత, సినీ నటుడు జాన్ కొట్టొలీ ఇవాళ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న

రెండో పెళ్లా.. సినిమానా.. ఈ ట్విస్టేంటి మనోజ్!?

టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్.. కొద్ది రోజుల క్రితమే భార్య ప్రణీత రెడ్డి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని వాడేసుకుంటున్న నాగ‌శౌర్య‌

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య ఈ నెల 31న `అశ్వ‌థ్థామ‌` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే.

‘మా’ నరేష్‌ను చిరంజీవి ఏం చేయబోతున్నారు!?

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు నరేష్‌ను క్రమ శిక్షణా సంఘం ఏం చేయబోతోంది..? ఆయన్ను తప్పించాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారా..?