'నిన్ను కోరి' థియేట్రికల్ ట్రైలర్ కు 8 మిలియన్ వ్యూస్

  • IndiaGlitz, [Monday,June 19 2017]

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్నుకోరి'. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌కు అన్నిచోట్ల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పటివరకు ఈ ట్రైలర్‌కు 8 మిలియన్‌ డిజిటల్‌ వ్యూస్‌ వచ్చాయి.

ట్రైలర్‌లోని డైలాగ్స్‌, పాటలు, ఫోటోగ్రఫీ అన్నీ ఎక్స్‌ట్రార్డినరీగా వున్నాయని, హీరో నాని, హీరోయిన్‌ నివేదా థామస్‌, ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆది పినిశెట్టి.. ఇలా ట్రైలర్‌లో కనిపించిన ప్రతి ఒక్కరి డైలాగ్స్‌ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కోన వెంకట్‌ డైలాగ్స్‌ ఈ చిత్రానికి ఓస్పెషల్‌ ఎస్సెట్‌గా చెప్పొచ్చు. ఈ చిత్రానికి గోపీసుందర్‌ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ అందించారు. నిర్మాత దానయ్య డి.వి.వి. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమాని చాలా రిచ్‌గా నిర్మించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమవుతున్న శివ నిర్వాణ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడని యూనిట్‌ మెంబర్స్‌ ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను జూన్‌ 29న చాలా గ్రాండ్‌గా చేయబోతున్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., కథ, దర్శకత్వం: శివ నిర్వాణ.

More News

'రంగుల కల' ప్రారంభం

ఎల్.వి.మూవీ మేకర్స్ బ్యానర్పై కొత్త చిత్రం `రంగుల కల` సోమవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. వి.క్రాంతి కుమార్ దర్శక నిర్మాత. తొలి సన్నివేశానికి రాజ్కుమార్.ఎం. క్లాప్ కొట్టగా సిద్ధేశ్వర పీఠం స్వామి విశ్వదానంద కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

'వాసుకి' చిత్రానికిగానూ ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్న నయనతార

స్టార్ హీరోయిన్ నయనతార టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `వాసుకి`. మలయాళ చిత్రం `పుదియ నియమం` చిత్రానికి అనువాద చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫ్యాన్సీ రేటుకు 'పిఎస్ వి గరుడ వేగ 126.18 ఎం' ఓవర్ సీస్ హక్కులు...

యాంగ్రీ యంగ్ మెన్ డా.రాజశేఖర్ కెరీర్లోనే 25 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ `పిఎస్వి గరుడవేగ 126.18ఎం`. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నారు.

జూన్ 20న 'జయదేవ్' ప్రీ రిలీజ్ ఫంక్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్కుమార్ భారీ స్థాయిలో 'జయదేవ్' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

సూర్య విలన్ గా కార్తీక్...

సీతాకోక చిలుక సహా పలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించిన సీనియర్ ఆర్టిస్ట్ కార్తీక్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా సూర్య హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న `తానా సెంద కూట్టమ్` చిత్రంలో నటిస్తున్నాడు.