9 మందిని పొట్టనబెట్టుకున్న శానిటైజర్..

  • IndiaGlitz, [Friday,July 31 2020]

ఏపీలో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ లాక్‌డౌన్ విధిస్తున్నారు. దీంతో మద్యం దుకాణాలు కూడా బంద్ అవుతున్నాయి. మద్యానికి బానిసైన పలువురు మానసికంగా కుంగిపోతున్నారు. దీంతో మద్యం తాగకుండా ఉండలేక శానిటైజర్‌ను తాగేస్తున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులో ఇదే ఘటన జరిగింది. కరోనా కారణంగా మద్యం దుకాణాలు మూసి ఉండటంతో పలువురు యాచకులు శానిటైజర్ తాగేశారు. దీంతో ఇప్పటి వరకూ తొమ్మిది మంది మృతి చెందారు.

మృతుల్లో అనుగొండ శ్రీను బోయ(25), భోగేమ్ తిరుపతయ్య (37), గుంటక రామిరెడ్డి (60) , కడియం రమణయ్య (30), కొనగిరి రమణయ్య (65), రాజారెడ్డి (65) తో పాటు మరో ముగ్గురు యాచకులున్నారు. మద్యం దొరక్క శానిటైజర్ తాగిన వారిలో గత రాత్రి ముగ్గురు మృతి చెందగా.. చికిత్స పొందుతూ నేడు మరో ఆరుగురు మృతి చెందారు. అయితే వీరంతా మద్యం షాపులు మూసివేయడంతో శానిటైజర్ తాగినట్లు భావిస్తున్న పోలీసులు.. మరోవైపు కల్తీ మద్యం లేదం కల్లు ఏమైనా తీసుకుని ఉంటారా.. అన్న కోణంలోనూ విచారణ నిర్వహిస్తున్నారు.

More News

తాత గొప్ప‌త‌నం ఈరోజు ఇంకా బాగా తెలుస్తుంది:  అల్లు అర్జున్‌

ఈరోజు సీనియ‌ర్ క‌మెడియ‌న్‌, దివంగ‌త అల్లు రామ‌లింగ‌య్య వ‌ర్ధంతి. ఆయ‌న 16 వ‌ర్ధంతి నేడు. సినీ ప్రియులు, ఆయన కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌కు నివాళులు అర్పిస్తున్నారు.

బర్త్ డే సందర్భంగా వలస కార్మికులకు సోనూసూద్ సర్‌ప్రైజ్..

పుట్టినరోజు చేసుకుంటున్న వారికి సన్నిహితులు బహుమతులిచ్చి సర్‌ప్రైజ్ చేయడం కామన్‌. కానీ రీల్ లైఫ్ విలన్..

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ పునర్నియామకం..

ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. గురువారం అర్థరాత్రి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమిస్తూ జీవో జారీ చేసింది.

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. నేడు 1986 కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ డబుల్ డిజిట్‌లో కేసులు నమోదవుతున్నాయి.

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన కీలక సమాచారమిచ్చిన రాజేష్ భూషణ్..

ప్రపంచమంతా కరోనా విజృంభిస్తోంది. కరోనా విముక్తి కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. దీనికోసం శాస్త్రవేత్తలు కూడా తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు.