అజర్‌బైజాన్‌లో '90 ఎంఎల్‌' పాటల చిత్రీకరణ పూర్తి...

  • IndiaGlitz, [Tuesday,November 05 2019]

'ఆర్‌ఎక్స్100' ఫేమ్‌ కార్తికేయ నటిస్తోన్న మరో విభిన్న చిత్రం '90 ఎం.ఎల్‌'. శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. 'ఆర్‌ ఎక్స్100' తో సంచలన విజయం సృష్టించిన కార్తికేయ క్రియేటివ్‌ వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నేహా సోలంకి ఇందులో కథానాయిక.

ఈ చిత్రం విశేషాలను నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ వివరిస్తూ ''టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా వైవిధ్యంగా ఉంటుంది. అలాగే కమర్షియల్‌ అంశాలతో వినోదాత్మకంగా ఉంటుంది. ఇటీవలే మూడు పాటలను అజర్‌ బైజాన్‌లో చిత్రీకరించాం. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతోంది. అతి త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం'' అని చెప్పారు.

దర్శకుడు శేఖర్‌ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ ''అజర్‌ బైజాన్‌ రాజధాని బాకులోని బ్యూటీఫుల్‌ లొకేషన్స్ దగ్గర, సీజీ మౌంటెయిన్స్ దగ్గర, క్యాస్పియన్ సముద్రం దగ్గర '8' రోజుల పాటు ఈ మూడు పాటల్ని చిత్రీకరించాం. హీరో హీరోయిన్‌పై 'వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే' అనే ఎమోషనల్‌ గీతాన్ని చిత్రీకరించాం. 'సింగిల్‌ సింగిల్‌' అనే పాటను ఫుల్‌ డ్యాన్స్ నెంబర్‌గా హీరో, హీరోయిన్‌, 20 మంది డ్యాన్సర్లపై తీశాం. 'నాతో నువ్వుంటే చాలు' అనే డ్యూయట్‌ని హీరో - హీరోయిన్‌, 10 మంది డ్యాన్సర్లపై షూట్‌ చేశాం. ఈ '3' పాటలకూ జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఎక్స్ ట్రార్డినరీగా స్టెప్స్ కంపోజ్‌ చేశారు. ఈ సినిమాలో ఈ పాటలు మంచి హైలైట్‌గా నిలుస్తాయి'' అని తెలిపారు.

More News

ప‌వ‌న్ కోసం సిద్ధమవుతోన్న సెట్

జ‌న‌సేన‌నాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సినిమా `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

హత్య కేసులో కీలక ఆధారం కానున్న ‘అమెజాన్ అలెక్సా’

ఓ హత్య కేసులో సౌండ్ రికార్డర్ అమెజాన్ అలెక్సా కీలక ఆధారంగా మారనుంది.

పాట‌తో ప్రారంభించ‌నున్న చిరు

`ఖైదీ నంబ‌ర్ 150`తో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి... తాజాగా హిస్టారిక‌ల్ డ్రామా `సైరా.. న‌ర‌సింహారెడ్డి`తో మ‌రో భారీ విజ‌యాన్ని అందుకున్నారు.

ల‌స్ట్ స్టోరీస్‌పై నందినీ రెడ్డి వివ‌ర‌ణ‌

డిజిటల్ మీడియా హ‌వా కొన‌సాగుతున్న త‌రుణంలో ప‌లు వెబ్ సిరీస్‌లు రూపొంద‌నున్నాయి. ఈ వెబ్‌సిరీస్‌ల ట్రెండ్ త‌మిళం, తెలుగులోనూ స్టార్ట్ అయ్యాయి.

యూరప్‌కు బన్నీ

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అలియాస్‌ బన్నీ యూరప్‌ వెళుత్నునారా? అంటే అవుననే సమాధానం ఆయన సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తుంది.