'90 ఎంఎల్‌' డిసెంబ‌ర్ 5న విడుద‌ల

  • IndiaGlitz, [Sunday,November 10 2019]

'ఆర్‌ఎక్స్100' ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటించిన '90 ఎం.ఎల్‌' రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. డిసెంబ‌ర్ 5న విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ నిర్ణ‌యించింది. ఈ చిత్రంతో శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. 'ఆర్‌ ఎక్స్100' తో సంచలన విజయం సృష్టించిన కార్తికేయ క్రియేటివ్‌ వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నేహా సోలంకి కథానాయిక. ఈ చిత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ థియేట్రిక‌ల్ రైట్స్ ని శ్రీ వైష్ణ‌వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫ‌ర్‌కి సొంతం చేసుకుంది.

నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ ''ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కారం అన్నీ స‌వ్యంగా జ‌రుగుతున్నాయి. షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. 90.ఎంఎల్ అనే టైటిల్ కి త‌గ్గ‌ట్టుగానే సినిమా కూడా వైవిధ్యంగా ఉంటుంది. క‌మ‌ర్షియ‌ల్ అంశాలు పుష్క‌లంగా ఉంటాయి. ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగుతుంది. విజువ‌ల్‌గానూ రిచ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా అజ‌ర్‌బైజాన్‌లో మూడు పాట‌లు చిత్రీక‌రించాం. సినిమా గురించి మంచి పాజిటివ్ బ‌జ్ స్ప్రెడ్ అయింది. శ్రీ వైష్ణ‌వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫ‌ర్ కి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ థియేట్రిక‌ల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. డిసెంబ‌ర్ 5న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం'' అని అన్నారు.

దర్శకుడు శేఖర్‌ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ ''ఆర్‌.ఎక్.100లో కార్తికేయ‌ను చూడ‌గానే 90 ఎంఎల్ స్క్రిప్ట్ కి ప‌క్కాగా స‌రిపోయే హీరో అనిపించింది. డిసెంబ‌ర్ 5న థియేట‌ర్ల‌లో సినిమా చూసిన వారు కూడా కార్తికేయ‌కు టైల‌ర్ మేడ్ కేర‌క్ట‌ర్ అని ఫిక్స‌వుతారు. రీసెంట్‌గా అజ‌ర్‌బైజాన్ లో మూడు పాట‌ల‌ను చిత్రీక‌రించాం. ఆ పాట‌లు సినిమాకు హైలైట్ అవుతాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన రెండు పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. యూత్‌ఫుల్‌గా సాగే సినిమా ఇది'' అని చెప్పారు.

More News

'క్లైమాక్స్' చిత్రంలో తన రియల్ లైఫ్ క్యారెక్టర్ లో శ్రీరెడ్డి

`డ్రీమ్‌` చిత్రంతో ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ ల్స్ లో అవార్డులు ద‌క్కించుకున్న భ‌వానీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో

‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లం’పై జగన్ సవరణ!

సీఎంగా ప్రమాణం చేసిన నాటి నుంచి కీలక, సంచలన నిర్ణయాలతో ప్రభుత్వాన్ని సాగిస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తాజాగా ‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లం’

లిడో డాన్సర్స్ తో ఫస్ట్ సౌత్ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్

అల వైకుంఠపురంలో   సామాజవరగమన సాంగ్ షూట్ కి పారిస్ వెళ్లిన విషయం తెలిసిందే. పారిస్ లో లియో డాన్సర్స్ తో

'పింక్' కి పవన్ కళ్యాణ్ యాత్ర దెబ్బ?

జ‌న‌సేన‌నాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

సగానికి తగ్గించుకున్న బోయపాటి రెమ్యూనరేషన్

మాస్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకుని అగ్ర హీరోల‌తో యాక్ష‌న్ ఓరియెంటెడ్ సినిమాల‌ను తెర‌కెక్కించిన దర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను.