'96' తెలుగు రీమేక్ లీడ్ యాక్ట‌ర్స్ దొరికేశారా...

  • IndiaGlitz, [Friday,December 14 2018]

విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించిన చిత్రం '96'. వింద్ మీన‌న్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడులైన ట్రైల‌ర్‌లోని బ్యాగ్రౌండ్ స్కోర్‌కి, పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సి.ప్రేమ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ద‌క్కించుకున్నారు.

ఈయ‌న తెలుగులో రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. అయితే తెలుగులో స‌రైన లీడ్ యాక్ట‌ర్స్ దొర‌కడం లేదో లేక చేయ‌డానికి సంకోచిస్తున్నారో ఏమో కానీ '96' తెలుగు రీమేక్ వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. ముందు నాని, స‌మంత ... త‌ర్వాత నితిన్, త్రిష ఇలా ప‌లు పేర్లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. రీసెంట్‌గా కూడా గోపీచంద్, త్రిష పేరు విన‌ప‌డింది.

అయితే వీరెవ్వ‌రూ కార‌ట‌. లెటెస్ట్‌గా విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లో శ‌ర్వానంద్‌.. త్రిష పాత్ర‌లో స‌మంత న‌టించ‌బోతున్నార‌నేది స‌మాచారం. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో సినిమా ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి.