అ ఆ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్..

  • IndiaGlitz, [Tuesday,April 26 2016]

యువ క‌థానాయ‌కుడు నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం అ ఆ. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న స‌మంత క‌థానాయిక‌గా న‌టించింది. ఇటీవ‌ల షూటింగ్ పూర్తి చేసుకున్న అ ఆ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. మిక్కి జే మేయ‌ర్ సంగీతం అందించిన అ ఆ ఆడియోను మే 2న రిలీజ్ చేయ‌డానికి నిర్ణ‌యించారు.
హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో ఈ ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ చిత్రంలో న‌టుడు & ద‌ర్శ‌కుడు అవ‌స‌రాల శ్రీనివాస్ ఓ ముఖ్య‌పాత్ర పోషించిన‌ట్టు సమాచారం. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాకృష్ణ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న అ ఆ చిత్రాన్ని మే నెల‌లో రిలీజ్ చేయ‌నున్నారు.

More News

గెట్ రెడీ అంటున్న మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి ముహుర్తం ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరోసారి సెంటిమెంట్ ఫాలో అవుతున్న నాగ్..

నవ మన్మధుడు నాగార్జున-అందాల తార అనుష్క కలిసి నటిస్తే...ఆ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ఉంది.ఈ విషయం నాగార్జునకు బాగా తెలుసు.

మ‌హేష్ హ్యాండ‌స‌మ్ లుక్స్ వెన‌కున్న సీక్రెట్స్ ఇవే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఎంత అందంగా ఉంటాడో...ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అలాగే మ‌హేష్ వ‌య‌సు న‌ల‌భై ఏళ్లు అంటే..అవునా.. అని ఆశ్చ‌ర్య‌పోతారు..కానీ..ఇది నిజం.. మ‌హేష్ వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ మ‌రింత అందంగా త‌యార‌వుతున్నాడు.

ఏప్రిల్ 29న విడుదలకు 'జీలకర్ర బెల్లం' రెడీ

అభిజిత్, రేష్మ జంటగా శ్రీ చరణ్ కార్తికేయ మూవీస్ పతాకంపై విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శోభారాణి, నౌరోజీ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'జీలకర్ర బెల్లం'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది.

చరణ్ - విలన్ - డైరెక్షన్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విలన్ డైరెక్షన్ చేస్తానంటున్నారు.ఇంతకీ ఎవరా చరణ్-విలన్ అని తెగ ఆలోచిస్తున్నారా..?ఆయనే అరవింద్ స్వామి.