క్లీన్ యు సర్టిఫికెట్ తో వస్తున్న అ ఆ

  • IndiaGlitz, [Wednesday,May 25 2016]

యువ హీరో నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందిన‌ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అ ఆ. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న స‌మంత న‌టించింది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందించిన అ ఆ చిత్రం సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ యు స‌ర్టిఫికెట్ ఇచ్చింది. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందించిన అ ఆ పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భిస్తుంది. ఆడియోప‌రంగా విజ‌యం సాధించిన అ ఆ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం రోజైన జూన్ 2న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. కుటుంబం అంతా క‌లిసి చూసేలా చిత్రాల‌ను తెర‌కెక్కించే త్రివిక్ర‌మ్ ఈసారి అ ఆ తో విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు అ ఆ టీమ్.

More News

హ్యాపీ బ‌ర్త్ డే టు హీరో కార్తీ

మ‌ణిర‌త్నం ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించి..ఆత‌ర్వాత త‌మిళ్ లో ప‌రుత్తివీర‌న్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ క‌థానాయ‌కుడు కార్తీ.

కాజల్ కు కలిసి రాలేదు...

పంజాబీ ముద్దుగుమ్మ కాలజ్ అగర్వాల్ కు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.

పా రంజిత్ దర్శకత్వంలో సూర్య...

24 వంటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తూ,నిర్మించి సక్సెస్ సాధించిన హీరో సూర్య ఇప్పుడు వేసవి సెలవులను పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు.

ఎన్టీఆర్ విలన్ ఎవరంటే....

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం జనతాగ్యారేజ్.

నవీన్ సరసన హీరోయిన్ గా....

నవీన్ చంద్ర హీరోగా బుర్రకథ అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.