'ఎ బ్యూటిఫుల్ గర్ల్' టీజర్ ను లాంచ్ చేసిన హీరో అడవి శేష్

  • IndiaGlitz, [Saturday,October 01 2022]

బ్యూటిఫుల్ హీరోయిన్ ఛార్మి తో మంత్ర, అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై చిత్రాలు తీసి ఎంతో మంచిపేరు తెచ్చుకున్న జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ పై నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ నటీ నటులుగా, రవి ప్రకాష్ బోడపాటి రచన-దర్శకత్వంలో, ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపులు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం ”ఎ బ్యూటిఫుల్ గర్ల్ “.ఈ చిత్రానికి సహ నిర్మాతలు గా అనిల్, క్రాంతి జువ్వల, ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా మోహన్ దాస్ వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 21 న గ్రాండ్ గా విడుదలకు సిద్దమైన సందర్బంగా హీరో అడవి శేష్ ట్విట్టర్ ద్వారా శుక్రవారం ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు.

గిడియన్ కట్టా కొట్టిన తాజాగా ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో విడుదలైన ఈ టీజర్ ను గమనిస్తే, మరియు ఇప్పటి వరకు నేను ఎన్నో, మిస్సింగ్ కేసెస్,రేప్ కేసెస్ & మర్డర్ కేసెస్ లను చూశాను కానీ ఇది చాలా టిఫికల్ కేస్ అని పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న నటుడు మధునందన్ చెప్పే డైలాగ్ తో ఇదొక మర్డర్ మిస్ట్రీ కథ అనిపిస్తుంది. గతంలో చాలా మర్డర్ మిస్ట్రీ కథలు వచ్చినప్పటికీ.. ఇందులో కేవలం క్రైమ్‌ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా యాక్షన్‌, డ్రామా, సెంటిమెంట్‌, క్రైమ్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన కథను దర్శకుడు ఎంచుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎంతో స్మార్ట్ గా కనిపించిన కొత్త అబ్బాయ్ సమర్థ హీరో నా విల్లన్ ఆ అర్థం కావట్లేదు టీజర్ చూస్తుంటే, ఎంతో ఇన్నోసెంట్ గా కనిపించే హీరో నిహాల్ కోదాటిని అరెస్ట్ చేయడం, మరియు నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్ ల రొమాంటిక్ సీన్స్ మరియు న్యూస్ పేపర్ లో 'మోస్ట్ టెర్రీఫయింగ్ కేస్' అనే హెడ్ లైన్ చూస్తుంటే అందరిలో ఈ కథపై ఎంతో ఇంట్రెస్ట్ ను, క్యూరియాసిటీని క్రీయేట్ చేస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ దర్శకుడు రవి ప్రకాష్ బోడపాటి ప్రతిభ కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. అద్భుతమైన విజువల్స్ తో వస్తున్న ఈ సినిమాకు అర్వీజ్ సాంగ్స్ అందించారు, నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా అమర్ దీప్,ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశాబావాన్ని వ్యక్తం చేశారు చిత్ర దర్శక, నిర్మాతలు.

నటీ నటులు: నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ తదితరులు

More News

Dasara: నాని 'దసరా' ఫస్ట్ సింగిల్ 'ధూమ్ ధామ్' సాంగ్

నేచురల్ స్టార్ నాని  మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'దసరా' నుండి మాస్ , రగ్గడ్ డ్యాన్స్ మూవ్‌లతో కూడిన మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్

Allu Studios: అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించిన చిరంజీవి... తాతయ్య కల నెరవేర్చామన్న బన్నీ

దశబ్ధాల పాటు తెలుగు వారిని నవ్వుల జల్లులో తడిపిన దిగ్గజ నటుడు , పద్మశ్రీ అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లో

Hyderabad New Traffic Restrictions: ‘‘గీత’’ దాటితే ఫైనే... హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్, బీ అలర్ట్

హైదరాబాద్ నగరంలో ఇకపై అడ్డదిడ్డంగా వాహనాలు నడిపివారికి, ఏ మాత్రం రూల్స్ పాటించని వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.

బిగ్‌బాస్ సీజన్‌ 6లో తొలి మహిళా కెప్టెన్‌గా కీర్తి... రెండోసారి కటకటాల వెనక్కి అర్జున్

బిగ్‌బాస్ సీజన్ 6లో తొలిసారి ఓ మహిళా కెప్టెన్‌కి ఛాన్స్ దొరికింది అది కూడా ఎవ్వరూ ఊహించని విధంగా కీర్తి భట్ కెప్టెన్ కావడం విశేషం.

Nagarjuna : లీడర్‌గా నటిస్తా కానీ.. లీడర్ మాత్రం కాను, పొలిటికల్ ఎంట్రీపై తేల్చేసిన నాగార్జున

వైసీపీ అభ్యర్ధిగా, విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున.