తెర పై ర‌జ‌నీ జీవిత‌క‌థ‌..!

  • IndiaGlitz, [Wednesday,August 10 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి ఉన్న క్రేజ్ - ఇమేజ్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు అంద‌రికీ తెలిసిందే. కోలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాదు...బాలీవుడ్ స్టార్స్ సైతం ర‌జ‌నీ ఫ్యాన్ అని చెబుతుంటారు. ఇటీవ‌ల ర‌జ‌నీకాంత్ క‌బాలి చిత్రంతో ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి స‌రికొత్త రికార్డులు సృష్టించారు. ఇంత‌టి క్రేజ్ ఉన్న అసామాన్యుడు రజ‌నీకాంత్ మాత్రం సామాన్యుడుగా ఉండ‌టానికే ఇష్ట‌ప‌డుతుంటారు. టైమ్ దొరికితే చాలు హిమాల‌యాల‌కు వెళ్లి ధ్యానం చేసుకుంటుంటారు.

ఆప‌ద‌లో ఉన్న వారికి స‌హాయం చేస్తూ...ఎంతో మందిని ఆదుకున్నారు. అందుక‌నే ర‌జ‌నీ రీల్ లైఫ్ లోనే కాదు రియ‌ల్ లైఫ్ లో కూడా హీరోనే అంటారు. ఆర్టీసి బ‌స్ కండ‌క్ట‌ర్ గా ప్రారంభ‌మైన ర‌జ‌నీ జీవితం నేడు ఒక వ్య‌క్తిగా కాకుండా ఒక శ‌క్తిగా ఎద‌గ‌డం వెన‌క చాలా స్టోరీ ఉంది. సినిమా క‌థ‌కు ఏమాత్రం తీసిపోని ర‌జ‌నీ జీవితక‌థ‌ను తెర‌కెక్కిస్తే బాగుంటుంది అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట ర‌జనీ కుమార్తె ఐశ్వ‌ర్య‌. ప్ర‌స్తుతం ఈ విష‌యం పై సీరియ‌స్ గా ఆలోచిస్తున్నార‌ట‌. తండ్రి ర‌జ‌నీ రియ‌ల్ స్టోరీని తెర‌కెక్కించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిసింది.ఇది నిజ‌మై...ర‌జ‌నీ జీవిత చ‌రిత్ర తెర పైకి వ‌స్తే చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం.

More News

నిహారిక నెక్ట్స్ మూవీ ఫిక్స్

మెగా ఫ్యామిలీ నుంచి ఫ‌స్ట్ టైమ్ హీరోయిన్ గా నాగ‌బాబు కుమార్తె నిహారిక ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఒక మ‌న‌సు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఫ‌స్ట్ మూవీతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించ‌క‌పోయినా...న‌టిగా మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది.

అఖిల్ సినిమా నితిన్‌ చేస్తున్నాడా..?

అఖిల్‌, నితిన్‌ మంచి స్నేహితులు. ఆ స్నేహం కార‌ణంగానే అఖిల్ న‌టించిన తొలి చిత్రం అఖిల్‌ను నితిన్ నిర్మాత‌గా రూపొందించాడు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.

మంచు ఫ్యామిలీ సేనాప‌తి

న‌టుడుగా ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టించిన మంచు మోహ‌న్ బాబు, విష్ణు కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపొంద‌నుంది. మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రంలో పొలిటిక‌ల్ ట‌చ్ కూడా ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

హేబా ప‌టేల్ సైలైంట్‌గా కానిచ్చేస్తుందా..?

కుమారి 21 ఎఫ్ చిత్రంతో కుర్ర‌కారుకి బాగా ద‌గ్గ‌రైన హీరోయిన్ హేబా ప‌టేల్‌. ప్ర‌స్తుతం నేను..నా బాయ్‌ఫ్రెండ్స్‌, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా చిత్రాలల్లో న‌టిస్తుంద‌ని తెలుసు.

బాల‌య్యమూవీలో దేవిశ్రీ చేయ‌డం లేదా..?

బాల‌య్య గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. క్రిష్ పెళ్ళి కార‌ణంగా గ్యాప్ తీసుకున్న ఈ యూనిట్ ఈ నెలాఖ‌రున హైద‌రాబాద్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ల్లో షెడ్యూల్ జ‌రుపుకోవ‌డానికి రెడీ అవుతుంది.