A Journey to Kashi: 'ఏ జర్నీ టు కాశీ' ట్రైలర్ విడుదల

  • IndiaGlitz, [Sunday,December 04 2022]

వారణాసి క్రియేషన్స్ పతాకం పై చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ముఖ్య తారాగణం తో ముని కృష్ణ దర్శకత్వం లో దొరడ్ల బాలాజీ మరియు శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఏ జర్నీ టు కాశీ. ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను ఈరోజు పాత్రికేయ సమక్షంలో విడుదల చేసారు.

అనంతరం హీరో చైతన్య రావు మాట్లాడుతూ ఏ జర్నీ టు కాశీ చిత్రం నా కెరీర్ ప్రారంభంలో చేసిన చిత్రం. చాలా మంచి కథ. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు ముని కృష్ణ గారికి నిర్మాతలు బాలాజీ గారికి శ్రీధర్ గారికి నా ధన్యవాదాలు. ఇది చాలా అరుదైన చిత్రం. మంచి కంటెంట్ ఉన్న చిత్రం, ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలి, కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు, ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. చాలా రియలిస్టిక్ గా నాచురల్ గా ఉంటుంది. మా చిత్రం పనోరమా ఫిలిం ఫెస్టివల్ లో టాప్ 25 లిస్ట్ లో నిలిచింది. కోలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో విన్నర్ గా నిలిచింది. ఖ్యాతిలీన్ మరియు ప్రియా చాలా బాగా నటించారు. ఖ్యాతిలీన్ కి ఇది మొదటి సినిమా. తన మొదటి సినిమాలోనే ఇలాంటి క్యారెక్టర్ చేయటం చాలా గొప్ప విషయం. ప్రతి నటుడికి ఇలాంటి చిత్రం ఒకటి పడాలి, నేను ఇలాంటి చిత్రం చేయటం చాలా గొప్ప గా భావిస్తున్న. డిసెంబర్ 17 న విడుదల అవుతుంది. అందరు చూసి మా చిత్రాన్ని హిట్ చేస్తారు అని కోరుకున్నారు.

హీరోయిన్ ఖ్యాతిలీన్ గౌడ మాట్లాడుతూ ఇది నా మొదటి సినిమా, చాలా స్పెషల్ చిత్రం నాకు. హీరో చైతన్య మరియు దర్శకుడు ముని కృష్ణ గారు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసారు. కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులు చూస్తున్నారు, మా చిత్రంలో అద్భుతమైన కథ ఉంది, కాశీ గురించి దాని విశిష్టత గురించి గొప్పగా చెప్పారు. ఈ చిత్రం లో అందమైన ప్రేమకథ కూడా ఉంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అని తెలిపారు.

దర్శకుడు ముని కృష్ణ మాట్లాడుతూ ఏ జర్నీ టు కాశీ అనేది మన జీవితం లో చాలా ముఖ్యమైన విషయం. భారత ఖండానికి కాశీ ఒక ఆత్మ లాంటిది. కుంభమేళా షాహిస్తాన్ రోజు రెండు కోట్లమంది గంగానదిలో పవిత్ర సాన్నం చేస్తారు. చేసి జన్మరాహిత్యం పొందారని భావిస్తారు. కాశీ లో చనిపోతే మోక్షప్రాప్తి పొందుతారు అనే నమ్మకం మనకి ఉంది. ఇది ఒక రోడ్ జర్నీ కథ. కాశీ యాత్ర వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకువచ్చిందో తెలుసుకోవాలి అంటే మా చిత్రాన్ని చూడండి. డిసెంబర్ 17న విడుదల చేస్తున్నాం, అందరికి నచ్చుతుంది అని తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ ఏ జర్నీ టు కాశీ చాలా అరుదైన సినిమా. మంచి సినిమా నిర్మించామని తృప్తి మాకుంది. డిసెంబర్ 17 న రెండు రాష్ట్రాలలో విడుదల అవుతుంది. అందరు చూసి మా చిత్రాన్ని హిట్ చేస్తారు అనే నమ్మకం మాకుంది అని తెలిపారు.

బ్యానర్ : వారణాసి క్రియేషన్స్, చిత్రం పేరు : ఏ జర్నీ టు కాశీ

నటి నటులు : చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ, అక్షర మరియు తదితరులు

More News

Pawan - Sujeeth : సుజిత్ దర్శకత్వంలో పవర్‌స్టార్.. మండే సూర్యుడికి ఎదురుగా పవన్, ఫ్యాన్స్‌కి పూనకాలే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంచి జోరుమీదున్నారు. రాజకీయాలతో బిజిబిజీగా వుంటోన్న ఆయన గ్యాప్‌లో సినిమాలు పూర్తి చేస్తున్నారు.

BiggBoss: రేవంత్‌కి సర్‌ప్రైజ్, ఫైనల్‌లో అడుగుపెట్టిన శ్రీహాన్.. సీజన్‌కే బెస్ట్ కెప్టెన్‌గా ఇనయా

బిగ్‌బాస్ తెలుగు 6 ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో కంటెస్టెంట్స్‌ని ఫైనల్‌కి పంపే ‘‘టికెట్ టు ఫినాలే’’ టాస్క్ హోరాహోరీగా సాగుతోంది.

Chiranjeevi : ఆయనలా ఎవ్వరికీ కాకూడదు, అందుకే బ్లడ్ బ్యాంక్.. అభిమానులే లేకపోతే : చిరంజీవి వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగారు.

'వీరసింహారెడ్డి' జనవరి 12న విడుదల

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వీరసింహారెడ్డి'.

Lucky Lakshman: ‘లక్కీ లక్ష్మణ్’ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది - సోహైల్

బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’.