వివేక్ కూచిబొట్లకు అరుదైన గౌరవం


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్లలో రేట్లను హేతుబద్ధీకరించేందుకు ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు హోంశాఖ జీవో ఎంఎస్ నెంబరు 80ని విడుదల చేసింది. ఈ విషయంలో ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి సమగ్ర పద్ధతిలో సమస్యను పరిష్కరించడానికి ఏర్పాటుచేసిన కమిటీకి ఛైర్మన్‌గా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరించనున్నారు.
మెంబర్లుగా ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ అండ్ ఎక్స్ అఫీషియో సెక్రటరీ, లా డిపార్టుమెంట్ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు. సినీ పరిశ్రమ నుంచి నిర్మాత వివేక్ కూచిబొట్ల మాత్రమే సభ్యుడిగా తీసుకున్నారు. వివేక్ కు దక్కిన అరుదైన గౌరవం ఇది. తనకు దక్కిన గౌరవంపై వివేక్ స్పందించారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఐదుగురు సభ్యుల HADM కమిటీ ఆంధ్రప్రదేశ్‌లోని సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ రేట్లను క్రమబద్ధీకరించడానికి ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తుంది. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
ప్రేక్షకుల సౌకర్యం, ఎగ్జిబిటర్ సుస్థిరత, నిర్మాత ప్రయోజనాలను అర్థం చేసుకోవడంలో కమిటీ కీలకంగా పనిచేస్తుంది. సమతుల్యంగా, నిర్మాణాత్మకంగా తన నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తుంది. ఆ తర్వాత టికెట్ రేట్ల హేతుబద్ధీకరణపై ఓ నిర్ణయం తీసుకుంటారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com