త‌రుణ్ భాస్క‌ర్ షాక్‌!!

  • IndiaGlitz, [Saturday,February 22 2020]

షార్ట్ ఫిలింస్ నుండి 'పెళ్ళిచూపులు' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన త‌రుణ్ భాస్క‌ర్ తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని న‌మోదు చేసుకోవ‌డ‌మే కాదు.. రైట‌ర్‌గా కూడా జాతీయ అవార్డును కూడా దక్కించుకున్నాడు. దీంతో ఆయ‌న‌కు అవ‌కాశాలు వెల్లువెత్తాయి. ఆ త‌రుణంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో 'ఈన‌గ‌రానికి ఏమైంది' అనే సినిమా చేశాడు. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా ఓకే అనిపించుకున్న‌ప్ప‌టికీ త‌రుణ్‌భాస్క‌ర్‌కు ఆశించిన స్థాయిలో స‌క్సెస్‌ను మాత్రం ఇవ్వ‌లేక‌పోయింది. దాంతో త‌రుణ్ భాస్క‌ర్ త‌దుప‌రి సినిమా ఎలా చేస్తాడోన‌ని సందేహాలు మొద‌ల‌య్యాయి. ఆ త‌రుణంలో త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా ట‌ర్న్ ఇచ్చి అంద‌రికీ షాకిచ్చాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా మారి చేసిన 'మీకు మాత్ర‌మే చెప్తా' సినిమాలో హీరోగా న‌టించిన త‌రుణ్ భాస్క‌ర్‌కి ఆ సినిమా కూడా పెద్ద‌గా పేరు తెచ్చి పెట్ట‌లేదు. అదే స‌మ‌యంలో త‌రుణ్ భాస్క‌ర్ వెంక‌టేశ్‌తో సినిమా చేస్తాడ‌ని వార్త‌లు బాగా వినిపించాయి. ఈ త‌రుణంలో త‌రుణ్ భాస్క‌ర్ మ‌రోసారి అంద‌రికీ షాకిచ్చాడు. ఓ టీవీ షోను చేస్తున్నారు. ఓ ప్ర‌ముఖ ఛానెల్ ప్ర‌సారం చేయ‌బోయే ఈ షో 25వారాల పాటు ఉంటుంది. ఈ షో త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌వుతుంద‌ని త‌రుణ్ భాస్క‌ర్ త‌న ఇన్‌స్టా ద్వారా తెలియ‌జేశారు.

More News

సాయి కుమార్ చేతుల మీదుగా కాలేజ్ కుమార్ ట్రైలర్ లాంచ్ !!!

ఎమ్ ఆర్  పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్సణ లో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడ ఘన విజయం సాధించిన ఈ మూవీ ని  తెలుగు లో రిమేక్ చేసాడు

'పలాస 1978' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి .. మార్చ్ 6న విడుదల

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా  ‘‘పలాస 1978’’ .

మ‌హేశ్ సినిమా ఆగిపోయిందా?

ఈ ఏడాది సంక్రాంతికి ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ పెద్ద హిట్ సాధించాడు.

డైరెక్టర్ గా శివ‌కు '22' సినిమా బిగ్ హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నా - ప్ర‌భాస్

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో

ప్ర‌భాస్‌కు షాకిచ్చిన మోహ‌న్‌బాబు..?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్‌కి సీనియ‌ర్ విల‌క్ష‌ణ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు షాకిచ్చారా? అంటే అవున‌నే సమాధానం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతుంది.