'ఏ1 ఎక్స్‌ప్రెస్' మార్చి 5న‌ రిలీజ్‌

  • IndiaGlitz, [Sunday,February 21 2021]

టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న 25వ చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ హీరో సందీప్ కిష‌న్‌కి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు‌. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్నారు.

'ఏ1 ఎక్స్‌ప్రెస్' మార్చి 5న విడుద‌ల‌వుతుంద‌ని ఎనౌన్స్ చేస్తూ చిత్ర బృందం స‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ రొమాంటిక్ పోస్ట‌ర్‌లో హీరోయిన్ లావ‌ణ్యా త్రిపాఠిని వీపుమీద ఎత్తుకొని ఉన్నాడు హీరో సందీప్ కిష‌న్‌. ఇద్ద‌రూ హాయిగా న‌వ్వులు చిందిస్తున్నారు. వారి మ‌ధ్య కెమిస్ట్రీ అమేజింగ్ అనిపిస్తోంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైల‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. సందీప్ కిష‌న్ కెరీర్‌లో అత్య‌ధికంగా 8.5 మిలియ‌న్ వ్యూస్ పొందిన ట్రైల‌ర్‌గా ఇది నిలిచింది. హిప్ హాప్ త‌మిళ మ్యూజిక్ అందించిన పాట‌లు ఇప్ప‌టికే సంగీత ప్రియులను అమితంగా అల‌రిస్తున్నాయి.

ఈ సినిమా షూటింగ్‌లో త‌న హాకీ స్కిల్స్‌తో సందీప్ కిష‌న్ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేశారు. త‌న క్యారెక్ట‌ర్ కోసం బ‌రువు త‌గ్గి సిక్స్ ప్యాక్ బాడీని సాధించారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్ర‌ఫీ ఈ ఫిల్మ్‌కు మంచి ఎలివేష‌న్ తీసుకొచ్చింది.

తారాగ‌ణం: సందీప్ కిష‌న్‌, లావ‌ణ్యా త్రిపాఠి, రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్యా, రాహుల్ రామ‌కృష్ణ‌, మ‌హేష్ విట్టా, ర‌ఘుబాబు, అభిజిత్‌, భూపాల్‌, ఖ‌య్యుమ్‌, సుద‌ర్శ‌న్‌, శ్రీ‌రంజ‌ని, ద‌యా గురుస్వామి

More News

`గాలి సంపత్ `తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది - దిల్‌రాజు

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం  'గాలి సంప‌త్`. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడంతో

కుప్పంలో సీన్ రివర్స్.. చంద్రబాబు దిద్దుబాటు చర్యలు

‘ఇంటి గెలిచి.. రచ్చ గెలవాలి’ అంటారు పెద్దలు. టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యింది.

హీరో ఆర్యపై జర్మనీ మహిళ ఫిర్యాదు..

తమిళ, తెలుగు భాషల్లో అభిమానులను సొంతం చేసుకున్న హీరో ఆర్యపై ఓ జర్మనీ యువతి తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది.

వెండికాయిన్‌పై చిరు ప్రతిరూపం.. అభిమాని వినూత్న ప్రయోగం

మెగాస్టార్ చిరంజీవి అభిమానులంటే మామూలుగా ఉండరుగా.. ఆయనపై అభిమానాన్ని ఏదో ఒక రూపంలో చాటుతూనే ఉంటారు.

కాఫీ ప్రియులు తస్మాత్ జాగ్రత్త అంటున్న పరిశోధకులు!

పొద్దున లేవగానే చాలా మందికి వేడి వేడి కాఫీ గొంతు దిగనిదే రోజు గడవదు. మరికొందరికైతే ఏ పని చేయాలన్నా కప్పు కాఫీ పడాల్సిందే.