ఎ.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి సినిమా

  • IndiaGlitz, [Tuesday,March 28 2017]

ఒక విచిత్రం సినిమాతో తెలుగు సినిమాల్లోకి తెరంగేట్రం చేసి గుండెల్లో గోదారి, స‌రైనోడు, మ‌లుపు స‌హా ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన యువ క‌థానాయ‌కుడు ఆది పినిశెట్టి హీరోగా రుగ్వేద క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై య‌జ్ఞం, పిల్లానువ్వులేని జీవితం వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త చిత్రం ప్రారంభం కానుంది.

ఆది పినిశెట్టి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న హీరో, బెస్ట్ పెర్‌పార్మర్‌. ఆది న‌టించిన గ‌త చిత్రాలే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లు. కామెడి, ల‌వ్‌, యాక్ష‌న్‌, ఎమోష‌న్స్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న అద్భుత‌మైన క‌థ కుదిరింది. ఈ క‌థ‌కు ఆది పినిశెట్టి అయితే యాప్ట్ అవుతాడ‌ని త‌న‌కు క‌థ‌ను చెప్పాను. త‌న‌కు క‌థ న‌చ్చంది. అలాగే సినిమా మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌చేస్తాం అని ద‌ర్శ‌కుడు ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి తెలిపారు.

More News

మూడోవారంలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న '16'

నేటి రోజుల్లో సినిమా వారం ఆడితే గొప్ప.రెండో వారంలో ప్రవేశిస్తే బ్లాక్ బస్టర్.మూడోవారంలోకి వెళితే సిల్వర్ జూబ్లీ కిందే లెక్క.

పిశాచి - 2 ప్లాటినం డిస్క్ వేడుక

స్వర్ణభారతి క్రియేషన్స్ పతాకం పై లయన్ సాయి వెంకట్ అందిసున్న పిశాచి-2 ప్లాటినం డిస్క్ వేడుక ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది.

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నసుకుమార్ 'దర్శకుడు'

స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్ బ్యానర్లో నిర్మించిన తొలి చిత్రం `కుమారి 21 ఎఫ్`. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావడంతో నిర్మాతగా సక్సెస్ అయిన సుకుమార్ ఇప్పుడు నిర్మాతగా చేస్తున్న మలి ప్రయత్నం `దర్శకుడు`.

నా దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత వస్తోన్న క్యూట్ లవ్ స్టోరీ 'రోగ్' - పూరి జగన్నాథ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై డా|| సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న లవ్ ఎంటర్టైనర్ 'రోగ్'(మరో చంటిగాడి ప్రేమకథ).

బండ్ల గణేష్ ఓతోడేలు - సచిన్ జోషి

హీరో,నిర్మాత అయిన సచిన్ జోషికి,మరోనిర్మాత బండ్ల గణేష్ కు మధ్య పెద్ద వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.