close
Choose your channels

BiggBoss: బిగ్‌బాస్ ఇంట్లో ఆదిరెడ్డి భార్య, రాజ్ తల్లి.... రేవంత్, కీర్తి, రోహిత్‌ల కంటతడి

Wednesday, November 23, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 6 తెలుగు విజయవంతంగా 12వ వారంలోకి ప్రవేశించింది. ఎన్నో విమర్శలు, ట్రోలింగ్‌ను తట్టుకుని ఇక్కడి వరకు వచ్చింది. ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వుండటంతో షో రక్తి కడుతోంది. చివరి దశ కావడంతో ప్రతి సీజన్‌లానే కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీనిలో భాగంగా ఆదిరెడ్డి భార్య, రాజశేఖర్ తల్లి ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో సోమవారం నాటి నామినేషన్స్ హీట్ చల్లారిపోయింది. ఇంటి సభ్యులంతా ఆదిరెడ్డి భార్య, కూతురితో... రాజశేఖర్ తల్లితో ముచ్చట్లలో మునిగిపోయారు.

మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైన వెంటనే ఇంటి సభ్యులకు ‘‘బిగ్‌బాస్ కోచింగ్ సెంటర్’’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా ఫైమాని ఇంగ్లీష్ టీచర్, ఆదిరెడ్డిని డ్యాన్స్ టీచర్, శ్రీసత్యని మేకప్ టీచర్, రాజ్‌ని సింగింగ్ టీచర్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఫైమా తనకు వచ్చి రాని ఇంగ్లీష్‌తో నవ్వులు పూయించింది. ఇంటి సభ్యులు కూడా తమను తాము చిన్నపిల్లల్లాగా ఊహించుకుంటూ ఫైమా చెప్పిన మాటను వినకుండా, కామెడీ పండించారు. ఇక్కడ కూడా మన శ్రీహాన్ - శ్రీసత్యలు ఓవరాక్షన్ చేశారు. శ్రీసత్య తన పిర్ర గిల్లుతోందని శ్రీహాన్ ... ఫైమా టీచర్‌కు కంప్లయింట్ చేశాడు. ఆ వెంటనే శ్రీసత్య మేకప్ టీచర్‌గా శ్రీహాన్‌ని అమ్మాయిగా మార్చే ప్రయోగాలు చేసింది. తర్వాత ఆదిరెడ్డి డ్యాన్స్ టీచర్‌గా భయపెట్టి నవ్వించాడు.

మధ్యలో బిగ్‌బాస్ ఇంటి తలుపులు తెరచుకుని అందులోంచి ఆదిరెడ్డి భార్య కవిత, కూతురు ఎంట్రీ ఇచ్చారు. వారిద్దరిని హౌస్‌లో చూసి సంబరపడిపోయాడు ఆదిరెడ్డి. వచ్చీ రాగానే తన డ్యాన్స్ గురించి భార్యను అడగ్గా.. అంత వరస్ట్‌‌గా ఏం లేదని, చూసి నవ్వుకోవచ్చని చెప్పింది. కొట్టుకున్నా, తిట్టుకున్నా కలిసి మెలిసి వుండాలని కవిత సూచించారు. దానికి ఆదిరెడ్డి కలగజేసుకుంటూ నన్ను కూడా కొట్టమంటావా మరి అంటే .. దానికి నువ్వేమైనా పెద్ద తోపా అంటూ నాగ్ చెప్పిన డైలాగ్ పేల్చింది కవిత. ఇదే సమయంలో రోహిత్, మెరీనా కపుల్ ప్రస్తావన రాగా... వారిద్దరూ ఎంతో క్యూట్‌గా వుంటారని చెప్పింది. ఆ వెంటనే భార్య ముందే ఏమాత్రం భయపడకుండా వీరిద్దరిని చూశాక తనకు రెండో పెళ్లి చేసుకోవాలని అనిపించిందని ఆదిరెడ్డి చెప్పాడు. దీనికి వున్న దానిని బాగా చూసుకో అంటూ కౌంటరిచ్చింది కవిత.

గతంలో హౌస్‌లో వున్న కారణంగా ఆదిరెడ్డి తన కుమార్తె ఫస్ట్ బర్త్ డే మిస్ అయ్యాడు. దీంతో బిగ్‌బాస్ అతనికి సర్‌ప్రైజ్ ఇచ్చేలా ఇంట్లో కేక్ కటింగ్ ఏర్పాట్లు చేశాడు. ఇంటి సభ్యుల మధ్య ఆదిరెడ్డి తన కుమార్తె బర్త్ డే వేడుకలు చేశారు. దీనికి ఆదిరెడ్డి బాగా ఎమోషనల్ అయ్యాడు. తనకు ఇది పెద్ద సక్సెస్ అన్న ఆయన... ఓ కామన్‌మేన్ 12 వారాలు బిగ్‌బాస్ ఇంట్లో వున్నాడని ఇంతకంటే ఏం కావాలంటూ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు.

ఆ కాసేపటికే రాజశేఖర్ తల్లి ఇంట్లోకి ప్రవేశించారు. ఆవిడ వస్తూనే కొడుకుని ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. అంతేనా కాటుకతో దిష్టి చుక్క పెట్టి.. చేతికి తాయెత్తు కట్టి బిగ్‌బాస్ టైటిల్ గెలవాలని ఆశీర్వదించారు. కంటెస్టెంట్స్ అంతా బాగా ఆడుతున్నారని ఆమె ప్రశంసించారు. ముఖ్యంగా రాజ్ తన తల్లిని, కుటుంబాన్ని బయటి ప్రపంచానికి చూపించానని సంబరపడ్డాడు. ఇప్పుడు తనకు క్రేజ్ పెరిగిందని, అంతా సెల్ఫీలు అడుగుతున్నారని ఆవిడ కూడా తన ఆనందాన్ని పంచుకు్ననారు. ఈ క్రమంలో ఫ్యామిలీ, పిల్లలను గుర్తుచేసుకుని రోహిత్, రేవంత్, కీర్తి భట్‌లు కంటతడి పెట్టుకోవడంతో ఇంట్లో ఉద్విగ్న పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.