ఆది సాయికుమార్ హీరోగా పాన్ ఇండియా చిత్రం

  • IndiaGlitz, [Friday,July 10 2020]

బాహుబ‌లితో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్ర‌పంచానికి తెలిసింది. అప్ప‌టి నుండి మ‌న టాలీవుడ్ హీరోలంద‌రూ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో యువ క‌థానాయ‌కుడు ఆది సాయికుమార్‌ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఒక సిరీస్‌లా చేయడానికి ప్లాన్ చేస్తుండ‌టం విశేషం.

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న ఆది సాయికుమార్ ఈ పాన్ ఇండియా చిత్రం త‌న‌కు పెద్ద బ్రేక్ అవుతుంద‌ని భావిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్క‌బోతున్న ఈ చిత్రంలో ఫాంట‌సీ ఎలిమెంట్స్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. య‌స్.వి.ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రై.లి బ్యాన‌ర్‌పై డెబ్యూ డైరెక్టర్ బాలవీర్.య‌‌స్‌ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న‌ ఈ చిత్రాన్ని య‌స్‌.వి.ఆర్ నిర్మిస్తున్నారు.

ఇది వ‌ర‌కు ఆది సాయికుమార్ చేసిన చిత్రాల‌కు భిన్నంగా కామిక్ ట‌చ్‌తో సాగే చిత్ర‌మిది. మేక‌ర్స్ రెండేళ్ల పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌పై దృష్టి పెట్టారు. ప‌క్కా అంద‌రినీ ఆక‌ట్టుకునేలా స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఈ పాన్ ఇండియా సిరీస్‌లో చాప్ట‌ర్1 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

More News

ఏపీలో నేడు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు 

ఏపీలో నేడు రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగడం గమనార్హం.

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కొట శ్రీనివాస‌రావు

విల‌క్ష‌ణ న‌టుడు కొటాశ్రీనివాస‌రావు వేయ‌ని పాత్ర‌లు లేవ‌నే చెప్పాలి.. భార‌త‌దేశం లో  సుమారు అన్ని భాష‌ల్లో న‌టించి మెప్పించిన గొప్ప లెజండ‌రి యాక్ట‌ర్ ఆయ‌న‌.

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భ‌వ్య క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 11గా నిర్మించిన చిత్రం `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`.

2 రోజులుగా అంబులెన్స్‌లోనే నిండు గర్భిణి.. చివరకు..

నిండు గర్భిణి.. అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం రెండు రోజుల పాటు అంబులెన్స్‌లోనే జంట నగరాల్లోని పలు హాస్పిటల్స్ తిరిగింది.

పొలిటికల్ జిమ్మిక్‌లొద్దు: కేసీఆర్ మిస్సింగ్ పిటిషన్‌పై హైకోర్టు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలపాలంటూ ఇటీవల తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.