Download App

ఆది స‌ర‌స‌న మిస్తీ..

రచయిత గా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్న బాబు  తొలిసారి డైరెక్టర్ గా రాబోతున్నారు..యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా న‌టిస్తున్న ఈచిత్రానికి బుర్ర‌కథ అనేది టైటిల్‌. దీపాలా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో ఆది సాయికుమార్ జ‌త‌గా మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి న‌టిస్తుంది.

బాలీవుడ్  స‌హా ద‌క్షిణాది సినిమాల్లో న‌టించిన మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి హీరోయిన్‌గా ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించింది. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మిస్తీకి తెలుగులో మ‌రో అవ‌కాశం వ‌చ్చిన‌ట్లే. మ‌రి ర‌చ‌యిత అయిన ర‌త్న‌బాబు మిస్తీ చ‌క్ర‌వ‌ర్తిని ఎలా ప్రెజంట్ చేస్తాడో చూడాలి.