BiggBoss: బిగ్‌బాస్‌లో ‘‘ఆకలి రాజ్యం’’... శ్రీహాన్‌తో క్లోజ్‌గా ఇనయా, గీతూ-ఆదిరెడ్డిలకు శిక్ష

  • IndiaGlitz, [Thursday,October 20 2022]

ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వకపోవడంతో కంటెస్టెంట్స్‌పై బిగ్‌బాస్ విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. మీ లాంటి వేస్ట్ గాళ్లని ఏ సీజన్‌లోనూ చూడలేదని... మీకు ఫుడ్డు , బెడ్డూ వేస్ట్ అని ఇష్టం లేకపోతే బయటకు వెళ్లిపోవచ్చంటూ గడ్డిపెట్టాడు. అంతేకాదు.. ఈ వారం ఇంటికి కెప్టెన్ ఎవరూ వుండడని, కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు బిగ్‌బాస్. ఈ పరిణామంతో అటు ప్రేక్షకులు, ఇటు కంటెస్టెంట్స్ షాకయ్యారు. దీంతో ఏం చేయాలో తెలియక ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు ఇంటి సభ్యులు. తప్పయిపోయిందని.. క్షమించాలని పలువురు కోరినా బిగ్‌బాస్ స్పందించలేదు.

దీంతో టాస్క్ గురించి.. బిగ్‌బాస్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ తెగ ఫీలైపోయారు కంటెస్టెంట్స్. ఒకరికొకరు తమ సన్నిహితులు చేసిన తప్పుల గురించి విమర్శించడం మొదలుపెట్టారు. నువ్వు ఎంటర్‌టైన్ చేయలేదు కదా.. నువ్వు వెళ్లిపోతావేమో అని భయం వేసింది గీతక్క అంటూ ఆదిరెడ్డి అన్నాడు. అలా అంతా తమ ఆట గురించి కాకుండా పక్కవాళ్ల మీదే ఫోకస్ పెట్టారు.

ఇక ఈరోజు చెప్పుకోవాల్సింది ఇనయా గురించి. ఇప్పటి వరకు ఉప్పూ నిప్పులా వున్న శ్రీహాన్- ఇనయాల మధ్య ఈరోజు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఫస్ట్ నుంచి వున్న గొడవల కారణంగా నిన్న నామినేట్ చేశాను కానీ.. ఈ వారం నిన్ను పాయింట్ చేయడానికి ఏం లేదు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావంటూ శ్రీహాన్‌కు అండగా నిలిచింది ఇనయా. ఇదే సమయంలో సూర్యకు , ఇనయాకు మధ్య ఎందుకో గ్యాప్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇదిలావుండగా ఇంటిసభ్యులంతా నిన్నటి పరిణామాలపై ఆలోచిస్తూ వుండగా... హౌస్‌లో దొంగలు పడ్డారు. అందరినీ బెడ్ రూమ్‌లో బంధించి... ఆహారాన్ని దొంగిలించుకుపోయారు. అలాగే స్టవ్, ఓవెన్ ఏదీ పనిచేయకుండా చేశారు. అప్పటికే ఆకలితో అలమటిస్తోన్న కంటెస్టెంట్స్‌‌ పొట్ట పట్టుకుని ఏడుస్తూ కనిపించారు.

అయితే ఇదంతా బిగ్‌బాస్ పనేనని తర్వాత తెలిసిందే. పనిష్‌మెంట్‌లో భాగంగానే బిగ్‌బాస్ ఇంటిలో ఆకలిరాజ్యం క్రియేట్ చేసినట్లుగా తేలింది. ఫుడ్ కావాలంటే ఫైట్ చేయాల్సిందే అని టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విభజించి గెలిచిన వారికే ఫుడ్ వుంటుందని చెప్పాడు. అంతేకాదు.. ఒక గ్రూప్ సంపాదించుకున్న ఆహారాన్ని మరొక గ్రూప్ తీసుకోకూడదని కండీషన్ పెట్టాడు. దీంతో తొలుత దాల్‌రైస్, తర్వాత చపాతీలు గెలుచుకున్నారు. అయితే మన రివ్యూ బ్యాచ్ గీతూ - ఆదిరెడ్డిలు నిబంధనలు ఉల్లంఘించి చపాతీ- ఆలూ కర్రీ పంచుకుని తిన్నారు. దీనిపై బిగ్‌బాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరికి భారీ కడాయిలు తోమే శిక్షను వేశాడు. అసలే మనోళ్లు పనులు చేయడంలో బద్ధకస్తులు కావడంతో అంట్లు తోమే శిక్ష ఫన్నీగా అనిపించింది. ఇంకేముంది.. పెళ్లికి వేస్తారు అంట్లు.. మా గీతక్క తోముతుంది అంట్లు అంటూ స్లోగన్స్ అందుకున్నారు కంటెస్టెంట్స్. అయితే గీతూ ఇక్కడా బిల్డప్ ఇచ్చింది గీతక్క. మా ఇంట్లో నేను చేయి కడుక్కోవడానికే గిన్నె తెస్తారంటూ చెప్పింది.

మొత్తానికి బిగ్‌బాస్ కాస్త చల్లబడినట్లే కనిపిస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ కూడా కాస్త ఫర్వాలేదనిపిస్తోంది. కానీ కొంతమంది మాత్రం ఇంకా మారకుండా అలాగే బద్ధకంగా వున్నారు. మరి ఈ వారం ఇంటికి కెప్టెన్‌ విషయంలోనూ శుక్రవారం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More News

చిరంజీవినే అంటాడా ... ప్రొడక్షన్ మేనేజర్‌ని 13 కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, ఏం జరిగిందంటే.?

అల్లు అరవింద్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాలను ఆయన తెరకెక్కించారు.

దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా "స్లమ్ డాగ్ హజ్బెండ్" ఫ్రస్టేషన్ సాంగ్ రిలీజ్

సంజయ్ రావు హీరోగా మైక్ మూవీస్ నిర్మిస్తున్న కామికల్ ఎంటర్ టైనర్ సినిమా "స్లమ్ డాగ్ హజ్బెండ్".

Pawan Kalyan : ఎన్నికలకు ఎలా వెళ్లాలి.. ఒక్క రోజులో తేల్చలేం : చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం ఆసన్నమైందని.. ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని

Geetha Arts : ‘‘గీత’’ అంటే నా గర్ల్‌ఫ్రెండ్ అనుకుంటున్నారు.. బ్యానర్‌ పేరు వెనుక కథ ఇదే : అల్లు అరవింద్

తెలుగు చలనచిత్ర పరిశ్రమను శాసిస్తోన్న నలుగురిలో ఒకరు అల్లు అరవింద్. ఇక దేశంలోని బడా నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి.

BiggBoss: మీ అంత వేస్ట్‌గాళ్లు ఏ సీజన్‌లో లేరు.. బయటకు పోండి , కంటెస్టెంట్స్‌పై బిగ్‌బాస్ ఆగ్రహం

గత సీజన్‌లతో పోలిస్తే బిగ్‌బాస్ 6 ప్రజల్ని ఏమాత్రం ఆకట్టుకోవడం లేదన్న సంగతి తెలిసిందే.