'ఆకాశ‌వాణి' 90 శాతం చిత్రీక‌రణ పూర్తి

  • IndiaGlitz, [Thursday,April 18 2019]

తొలిసారి ఎస్‌.ఎస్‌.కార్తికేయ‌, అశ్విన్ గంగ‌రాజు, కాల‌భైర‌వ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న వైవిధ్య‌మైన క‌థా చిత్రం 'ఆకాశ‌వాణి '. ఓ రేడియో చుట్టూ ద‌ట్ట‌మైన అడ‌విలో జ‌రిగే ఆస‌క్తిక‌ర‌మైన చిత్ర‌మిది. పాడేరు అట‌వీ ప్రాంతంలో వేసిన భారీ సెట్‌తో పాటు ఇత‌ర లొకేష‌న్స్‌లో ఇప్ప‌టికే 90 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. షోయింగ్ బిజినెస్ బ్యాన‌ర్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అశ్విన్ గంగ‌రాజు మాట్లాడుతూ '' పాడేరు ప్రాంతంలో దాదాపు 50 రోజుల పాటు ఏక‌ధాటిగా జ‌రిగిన షెడ్యూల్‌ను ఛాలెంజింగ్ సిట్యువేష‌న్స్‌లో చిత్రీక‌రించారు. ఈ షెడ్యూల్ చాలా అడ్వెంచ‌ర‌స్‌గా అనిపించింది. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేశాం. 90 శాతం సినిమా పూర్త‌య్యింది. 10 శాతం మాత్ర‌మే చిత్రీక‌రించాల్సిఉంది'' అన్నారు.

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి 'ఈగ‌' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు.. త‌దుప‌రి రాజ‌మౌళి బాహుబ‌లి సిరీస్‌కు అసిస్టెంట్ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశారు. ఇప్పుడు 'ఆకాశ‌వాణి' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అలాగే కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీత ద‌ర్శ‌కుడిగా.. రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ ఈ చిత్రంతో నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు.

ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ను పోషించారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

 

More News

'మ‌హ‌ర్షి' చిత్రీక‌ర‌ణ పూర్తి

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ చిత్రం `మ‌హ‌ర్షి` షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో

శ్రీరెడ్డి సక్సెస్.. ‘క్యాస్టింగ్ కౌచ్‌’‌‌పై కమిటీ ఏర్పాటు

టాలీవుడ్‌లో జరుగుతున్న ‘క్యాస్టింగ్ కౌచ్‌’ నటి శ్రీరెడ్డి ఉద్యమించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం అన్ని సినీ ఇండస్ట్రీలకు తెలియడం..

పీఎన్‌బీలో ప్రకంపనలు.. ఖాతాల్లో లక్షలు మాయం

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13 వేల కోట్ల రూపాయాల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

గుడ్ న్యూస్: స్టాండ్ బై జాబితాలో రిషబ్, రాయుడు

వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోలేని టీమిండియా ఆటగాళ్లు అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు బుధవారం నాడు బీసీసీఐ శుభవార్త చెప్పింది.

జెట్ ఎయిర్‌వేస్ కీలక నిర్ణయం.. అర్ధరాత్రి నుంచి బంద్

అప్పుల్లో కూరుకుపోయిన  ప్రైవేట్ రంగ విమాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.