close
Choose your channels

'ఆకాశ‌వాణి విశాఖ‌ప‌ట్ట‌ణ కేంద్రం' టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌

Thursday, April 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆకాశ‌వాణి విశాఖ‌ప‌ట్ట‌ణ కేంద్రం టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌

అంద‌రికీ స‌ముద్రం దాటి సీత‌ను క‌లిసిన రాముడు క‌థ తెలుసు.. కానీ ఇంటి ముందే ఉండి క‌న్న తండ్రిని క‌ల‌వ‌లేని ఈ కార్తీక్ క‌థ తెలుసా! అని అంటున్నారు. సాధార‌ణంగా మ‌నం డ‌బ్బులో, వ‌స్తువుల‌నో పొగొట్టుకుంటూ ఉంటాం. కానీ మ‌న ఐడెంటిటీని కోల్పోతే ఎలా ఉంటుంది? మ‌న అనుకున్న వారికి.. స్నేహితుల‌కు, ముఖ్యంగా మ‌నల్ని క‌న్న త‌ల్లిదండ్రుల‌కు మ‌న ఐడెంటిటీని మ‌న‌మే ప‌రిచ‌యం చేసుకోవాంటే ఎలా ఉంటుందనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంత‌కు మించిన బాధ‌, మాన‌సిక వేద‌న మ‌రోటి ఉండ‌దు. ఇలాంటి వైవిధ్య‌మైన క‌థాంశంతో కార్తీక్‌గా ప్రేక్ష‌కుల‌ను 'ఆకాశ‌వాణి విశాఖ‌ప‌ట్ట‌ణకేంద్రం' చిత్రంతో ప‌ల‌క‌రించ‌నున్నారు యువ క‌థానాయ‌కుడు శివ‌.

శివ‌, ఉమ‌య్ చంద్‌, ర‌క్ష‌, అక్షిత హీరో హీరోయిన్స్‌గా సైన్స్‌ స్టూడియోస్(SIGNS STUDIO) బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 గా రూపొందుతున్న చిత్రం 'ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం'. జ‌బ‌ర్‌ద‌స్త్ ఫేం స‌తీష్ బ‌త్తుల ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. మ‌ర్రి మేక‌ల మ‌ల్లిఖార్జున్ నిర్మాత‌. థ్రిల్లింగ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టీజ‌ర్ బుధ‌వారం విడుద‌లైంది.

ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశం, పాత్ర‌ల తీరు తెన్నులు, టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు రానటువంటి ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల‌ను చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

శివ‌, ఉమ‌య్ చంద్‌, ర‌క్ష‌, అక్షిత‌, , దేవిప్ర‌సాద్‌, తాగుబోతు ర‌మ‌ష్‌, ధ‌న‌రాజ్, స‌త్య‌, మాధ‌వీల‌త‌, వాసువ‌ర్మ‌, సూర్య‌, భ‌ద్రం త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: ప్ర‌దీప్‌, డ్యాన్స్‌: శ్రీకృష్ణ‌, ఎడిట‌ర్‌: ప్ర‌భు, మ్యూజిక్‌: కార్తీక్, సినిమాటోగ్ర‌ఫీ: ఆరీఫ్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: ముని రెడ్డి, చంద్ర‌కాంత్‌, కో ప్రొడ్యూస‌ర్‌: హ‌రికుమార్‌.జి, విశ్వ‌నాథ్‌.ఎం, నిర్మాత‌: మ‌ర్రి మేక‌ల మ‌ల్లిఖార్జున్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ బ‌త్తుల.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.