సెన్సార్ పూర్తి చేసుకొని మార్చి 10న విడుదలకు సిద్ధమవుతున్న 'ఆకతాయి'

  • IndiaGlitz, [Thursday,March 02 2017]

ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ప్యాక్డ్ లవ్ ఎంటర్ టైనర్ "ఆకతాయి". "రివెంజ్ ఈజ్ స్వీట్" అనేది ట్యాగ్ లైన్. మణిశర్మ సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రానికి "యు/ఎ" సర్టిఫికెట్ లభించింది. మార్చి 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ మాట్లాడుతూ.. "యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. మా డైరెక్టర్ రామ్ భీమన చిత్రాన్ని తెరకెక్కించిన విధానం సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అలాగే.. మణిశర్మ నేతృత్వంలో రూపొందిన ఆడియోకు విశేషమైన స్పందన లభించింది. చిత్రానికి కూడా అదే స్థాయి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు.

సుమన్, నాగ బాబు, రాంకీ, రాశి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణ మురళి, పృద్వీ, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్, నవీన్ నేని, జెమినీ సురేష్, జబర్దస్త్'టీం, స్పెషల్ సాంగ్: అమీషా పటేల్

ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం : మణిశర్మ, సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగదారి, ఆర్ట్ : మురళి కొండేటి, ఫైట్స్ : నందు, ఎడిటర్ : M.R.వర్మ, డాన్స్ : స్వర్ణ, జాని, సతీష్, అమిత్, స్టిల్స్ : వికాస్, కాస్ట్యూమ్ డిజైనర్ : భాను, కాస్ట్యూమ్స్ : మురళి, మేకప్ : వేణు, కో–డైరెక్టర్ : చల్లపల్లి వెంకటేశ్వర రావు, పబ్లిసిటి డిజైనర్ : అనిల్-భాను, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్ : శ్రీరంగం సతీష్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : మల్లిక్, నిర్మాతలు : K.R విజయ్ కరణ్, K.R కౌశల్ కరణ్, K.R అనిల్ కరణ్, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: రామ్ భీమన!

More News

లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ' ప్రేమలో పడితే 100% బ్రేకప్'

ఎస్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఎజిల్ దురై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘సెంజిత్తలే ఎన్ కాదలా’అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'ప్రేమలో పడితే 100%బ్రేకప్’

'రివాల్వర్ రాజు' గా రాబోతున్న సప్తగిరి

కమీడియన్ గా టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకొని తాజాగా కామెడీ ఎంటర్ టైనర్ సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో హీరోగాను ఎంట్రీ ఇచ్చి, సక్సెస్ అందుకున్నారు

విలన్ అవుతున్ననిర్మాత....

రజనీకాంత్ తో లింగ,రవితేజ పవర్ చిత్రాలను నిర్మించిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్..

'రాధ' టీజర్ రివ్యూ...

రన్ రాజారన్,మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు,ఎక్స్ ప్రెస్ రాజా,శతమానం భవతి వంటి సూపర్హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన హీరో శర్వానంద్

ఎన్టీఆర్ బాటలో విజయ్....

తమిళ సూపర్స్టార్ విజయ్ కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాటలో పయనిస్తున్నాడు.