ఆర్తి అగర్వాల్ బాటలో నయనతార వెళుతుందా?

  • IndiaGlitz, [Thursday,April 07 2016]

ప‌ద‌కొండేళ్ల క్రితం అందాల తార ఆర్తి అగ‌ర్వాల్ ఓ క్రెడిట్‌ని త‌న సొంతం చేసుకుంది. మ‌ళ్లీ ఇప్పుడు అదే దిశ‌గా మ‌రో తార ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ తార మ‌రెవ‌రో కాదు న‌య‌న‌తార‌. ఇంత‌కీ ఆ క్రెడిట్ ఏమిటంటే.. విక్ట‌రీ వెంక‌టేష్‌తో ముచ్చ‌ట‌గా మూడోసారీ విజ‌యం సొంతం చేసుకోవ‌డం. 'నువ్వు నాకు న‌చ్చావ్‌', 'వ‌సంతం', 'సంక్రాంతి'.. ఇలా వెంకీతో న‌టించిన ప్ర‌తిసారీ త‌న ఖాతాలో ఓ విజ‌యం వేసుకుంది అప్ప‌టి సంచ‌ల‌న తార ఆర్తి అగ‌ర్వాల్‌.

ఆ త‌రువాత శ్రియ‌, త్రిష లాంటి వారు మూడేసి సార్లు వెంక‌టేష్ తో జ‌త‌క‌ట్టినా ఇలా వ‌రుస‌గా విజ‌యాల‌ను మాత్రం త‌మ జాబితాలో వేసుకోలేక‌పోయారు. ఈ నేప‌థ్యంలో 'ల‌క్ష్మీ', 'తుల‌సి' చిత్రాల‌తో రెండు వ‌రుస విజ‌యాల‌ను వెంకీ కాంబినేష‌న్‌లో అందుకున్న న‌య‌న 'బాబు బంగారం'తో మూడో ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌రి ఆర్తి బాట‌లోనే న‌య‌న‌ కూడా వెళుతుందో లేదో తెలియాలంటే జులై వ‌రకు వేచి చూడాల్సిందే.

More News

స‌ర్ధార్ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సర్దార్ మూవీ లీక్డ్...?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.

రేపే బాల‌య్య వందో సినిమా ప్ర‌క‌ట‌న‌..

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వందో సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఉగాది రోజున అన‌గా రేపు ప్ర‌క‌టించ‌నున్నారు. అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.

రాజశేఖర్ ప్లేస్ ఎవరంటే....

కెరీర్ స్టారింగ్ లో నువ్వునేను, చిత్రం, జయం వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధించిన డైరెక్టర్ తేజ ఇప్పుడు అహం అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సినిమాకో మ్యూజిక్ డైరెక్ట‌రా?

సాధార‌ణంగా త‌నకి క‌లిసొచ్చిన లేదంటే స‌న్నిహితం ఉన్న‌ సంగీత ద‌ర్శ‌కుడుతో మ‌రో సినిమా చేయ‌డం ద‌ర్శ‌కుల‌కుండే అల‌వాటు. అయితే ఇందుకు విరుద్దంగా ఉన్నారు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్‌.