ఆటాడుకుందాం రా ఒక పండ‌గ లాంటి సినిమా - చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు

  • IndiaGlitz, [Wednesday,August 17 2016]

కాళిదాసు, క‌రెంట్, అడ్డా...చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన లేటెస్ట్ మూవీ ఆటాడుకుందాం రా. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు, ఎ.నాగ సుశీల సంయుక్తంగా నిర్మించారు. పుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఆటాడుకుందాం రా చిత్రాన్ని ఈనెల 19న రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ....ఈ చిత్రంలో సుశాంత్ డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపిస్తాడు. అనూప్ అందించిన‌ ఎక్స్ ట్రార్డిన‌రీ మ్యూజిక్ ఈ చిత్రానికి ఓ హైలెట్ గా నిలుస్తుంది. శ్రీధ‌ర్ సీపాన క‌థ‌ను మూడు నిమిషాల్లో చెప్పాడు. ఆ మూడు నిమిషాల్లోనే క‌థ ఎంత‌గానో న‌చ్చింది. డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి కూడా ఓ క‌థ‌ను రెడీ చేసారు. అయితే...శ్రీధ‌ర్ సీపాన క‌థ విన్న త‌ర్వాత నాగేశ్వ‌రరెడ్డి గారు నా క‌థ కంటే ఈ క‌థ బాగుంది అన‌డంతో శ్రీధ‌ర్ క‌థ‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇక టైటిల్ విష‌యానికి వ‌స్తే...ఈ క‌థ‌కు ఆటాడుకుందాం రా అనే టైటిల్ క‌రెక్ట్ గా స‌రిపోతుంది. ఆటాడుకుందాం రా అనే సాంగ్ లోనే అఖిల్ సుశాంత్ తో క‌లిసి డ్యాన్స్ చేసాడు.

అలాగే చైత‌న్య క‌థ‌ను మ‌లుపు తిప్పే ముఖ్య‌పాత్ర‌లో క‌నిపిస్తాడు.బ్ర‌హ్మానందం, పృథ్వీ, పోసాని, ముర‌ళీశ‌ర్మ‌..త‌దిత‌రులు చేసే కామెడీ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. టైమ్ మిష‌న్ సెట్ చాలా రిచ్ గా ఉంటుంది. అలాగే టైమ్ మిష‌న్ ఎపిసోడ్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమా గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే...ఆటాడుకుందాం రా అభిమానుల‌కు ఒక పండ‌గ లాంటి సినిమా అన్నారు.

More News

శర్వానంద్ 25వ సినిమా ఓవర్ సీస్ హక్కులను

రన్‌రాజారన్‌, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి కథానాయికగా, ఛత్రపతి, డార్లింగ్‌, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన భా

'ధృవ' టైటిల్ వెనుక ర‌హ‌స్యమ‌దేనా..?

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్న చిత్రం `ధృవ‌`. `మై ఎనిమి ఈజ్ మై స్ట్రెంగ్త్` అనే ట్యాగ్ లైన్‌తో సినిమా రూపొందుతోంది. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ నిర్మాత‌లుగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఆగ‌స్ట్ 15న విడుద‌లైంది.

ఓం న‌మో వేంక‌టేశాయ నాగార్జున ప్రీ లుక్ రిలీజ్..!

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న అధ్యాత్మిక చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

జోఅచ్యుతానంద టీజ‌ర్ రిలీజ్..!

నారా రోహిత్ - నాగ శౌర్య - రెజీనా కాంబినేష‌న్లో అవ‌స‌రాల శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్న చిత్రం జో అచ్యుతానంద‌. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు.

'తొలిప్రేమలో' ప్రతి సన్నివేశం అందంగా ఉంటుంది - ఆనంది

`క‌య‌ల్` అనే పేరుతో తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ చాలా పెద్ద హిట్ట‌య్యింది. సునామీ వ‌చ్చిన‌ప్పుడు క‌న్యాకుమారిలో బ్రతికిన ఇద్ద‌రు వ్య‌క్తులు మ‌ధ్య జరిగే కథ ఇదని హీరోయిన్ ఆనంది అన్నారు. యాదాద్రి ఎంట‌ర్ టైన్మెంట్స్ తొలి ప్ర‌య‌త్నంగా త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన `క‌య‌ల్` చిత్రాన్ని `తొలిప్రేమ‌లో` అనే పేరుతో తెలుగులోకి విడుద‌&