close
Choose your channels

బాబాయ్ స్పీచ్‌కి అబ్బాయ్ ఫిదా

Tuesday, December 18, 2018 • తెలుగు Comments

బాబాయ్ స్పీచ్‌కి అబ్బాయ్ ఫిదా

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ అధినేత రాజ‌కీయ ప్ర‌చారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న అమెరికాలో బిజీ బిజీగా ఉన్నాడు. ఆదివారం డ‌ల్లాస్‌లో ప్ర‌వాసాంధ్రుల‌తో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడారు. ధైర్యం ఉండ‌టం అంటే భ‌యం లేక‌పోవ‌డ‌మ‌నేది కాదు.. ప్ర‌తిరోజూ భ‌యాన్ని ఎదుర్కొంటూ ముందుకుపోవ‌డ‌మే అంటూ ఉద్వేగ పూరిత‌మైన ప్ర‌సంగం చేశారు.

బాబాయ్ ప‌వ‌న్ ప్ర‌సంగంపై అబ్బాయ్ రాంచ‌ర‌ణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. "ఇప్ప‌టి వ‌ర‌కు నేను విన్న బెస్ట్ ఇన్‌స్పిరేష‌న‌ల్ స్పీచ్ ఇది. ఇదే పవ‌న్‌క‌ల్యాణ్‌.. ది మ్యాన్‌, ది లీడ‌ర్‌, ది విజ‌న‌రీ" అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేశారు రాంచ‌ర‌ణ్‌. ప‌వ‌న్ స్పీచ్‌కు రాంచ‌ర‌ణ్ ఇలా స్పంద‌న తెల‌ప‌డంపై మెగాభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 

Get Breaking News Alerts From IndiaGlitz