close
Choose your channels

అభి విన్నర్.. అఖిల్ రన్నర్.. ముగిసిన బిగ్‌బాస్ షో..

Sunday, December 20, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ ఫినాలే మంచి ఫాస్ట్ బీట్స్‌తో ప్రారంభమైంది. ఆ తరువాత ఎలిమినేట్ అయిన 14 మంది కంటెస్టెంట్స్.. అదిరిపోయే మెలోడితో షోకు మంచి హైప్ ఇచ్చారు. తరువాత 14 మంది ఆఫ్టర్ బిగ్‌బాస్ తమ లైఫ్ ఎలా ఉందనేది పంచుకున్నారు. మరో మెడ్లీతో టాప్ ఫైవ్ ఐదుగురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌కు మిగిలిన హౌస్‌మేట్స్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్‌ను చూపించారు. దీంతో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అందరి జర్నీని ఒకే వీడియోలో చూపించారు. బిగ్‌బాస్ హౌస్‌లో తాము ఇష్టపడే ప్రదేశాలేంటో కంటెస్టెంట్‌లంతా చెప్పుకొచ్చారు. అద్భుతమైన మెడ్లీతో ప్రణీత ఎంట్రీ ఇచ్చింది. తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. ఆయనను ఒక కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసి తీసుకు వచ్చేందుకు మెహ్రీన్‌తో కలిపి హౌస్‌లోకి పంపించారు. అనిల్ రావిపూడి మాత్రం హౌస్‌లో రాక్ చేసేశారు. సొహైల్, అఖిల్ టాస్కుల్లో ఎలా చేస్తారు.. టాస్క్ అయిపోయిన తర్వాత హౌస్‌లోకి వచ్చి ఎలా బిహేవ్ చేస్తారనేది అనిల్ చేసి చూపించిన తీరు అద్భుతం. బిగ్‌బాస్‌ని అనిల్ ఎంతలా ఫాలో అవుతున్నారో తెలిసింది. కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ తర్వాత అనిల్ దర్శకత్వంలో ఐదుగురు కంటెస్టెంట్స్‌కి బ్లైండ్ ఫోల్డ్ కట్టి డ్రమిటికల్‌గా హారికను ఎలిమినేట్ చేశారు. హారిక బిగ్‌బాస్‌కి వెళ్లిన సమయానికి ఇప్పటికీ ఇంకా ఫ్యాట్ అవడం విశేషం. తరువాత మిగిలిన నలుగురి ఎలిమినేషన్ స్టార్ట్ చేశారు. దీనికోసం లక్ష్మీరాయ్‌ని హౌస్‌లోకి పంపించారు. మూడు లైట్స్‌ని పెట్టారు. ఎవరికి గ్రీన్ లైట్ వెలిగితే వారు ఎలిమినేట్. అరియానాకు గ్రీన్ లైట్ వెలిగింది. ఆమె ఎలిమినేట్ అయిపోయింది.

మెహ్రీన్ మరో పెర్ఫార్మెన్స్ తర్వాత ఇక టాప్ 3 లో సొహైల్, అఖిల్, అభి మిగిలారు. ఒక వాల్ట్‌లో గోల్డెన్ బ్రీఫ్ కేస్ పెట్టారు. దానిలో 20 లక్షలున్నాయని నాగ్ చెప్పారు. దానికి మూడు హ్యాండిల్స్ ఉన్నాయి. ముగ్గురినీ ఒక్కొక్క హ్యాండిల్ పట్టుకోమని చెప్పారు. మీలో ఒకరు తప్పక ఎలిమినేట్ అవుతారని కాబట్టి మీ డ్రీమ్ ఏంటని నాగ్ అడిగారు. అఖిల్ తన డ్రీమ్.. బిగ్‌బాస్ విన్ అవ్వాలని.. మూవీస్‌లో విలన్ అవ్వాలని ఉందని చెప్పాడు. తర్వాత సొహైల్.. తన డ్రీమ్ కూడా యాక్టర్ అవ్వాలని అని చెప్పాడు. అభి.. తనకు కూడా బిగ్‌బాస్ విన్ అవ్వాలని ఉందని చెప్పాడు. ఆ రూ.20 లక్షలు తీసుకుని ఎవరు ఎలిమినేట్ అవుతారని నాగ్ అడిగారు. మరో ఆఫర్ కూడా నాగ్ ఇచ్చారు. దానిలో ఇంకో రూ.5 లక్షలు పెంచుతున్నామని నాగ్ చెప్పారు. అయితే వెంటనే సొహైల్ నేను ఆ రూ.25 లక్షలు తీసుకుని ఎలిమినేట్ అవుతానని చెప్పాడు. తనకు తన తండ్రి, సోదరుడు కూడా పర్మిషన్ ఇచ్చారు. అయితే 10 లక్షలు ఆర్ఫనైజ్‌కి ఇచ్చేలా అయితేనే అని చెప్పాడు. దీనికి ఒప్పుకుని సొహైల్ ఎలిమినేట్ అవుతానని చెప్పాడు. దీంతో సొహైల్‌ను రూ.25 లక్షల బ్రీఫ్ కేస్ పట్టుకుని కన్ఫెషన్ రూమ్‌లోకి రావాలని నాగ్ చెప్పారు. తరువాత బిగ్‌బాస్ ట్రోఫీని నాగ్ చూపించారు.

ఆ ట్రోఫీని అఖిల్ లేదంటే అభి విన్ అవబోతున్నారని నాగ్ చెప్పారు. వెంటనే నాగ్ హౌస్‌లోకి వెళ్లారు. నాగ్‌కి అఖిల్, అభి ఇద్దరూ హౌస్ మొత్తం చూపించారు. తరువాత నాగ్.. అఖిల్, అభిలను స్టేజిపైకి తీసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ. సర్ మీ వేస్ట్ సైజ్ ఎంత? అని చిరుని నాగ్ అడిగితే.. నా భార్యను అడగాలి అంటూ స్పాంటీనియస్‌గా చిరు సమాధానమిచ్చారు. నా భార్యకు చిక్కానంటూ చిరు చెప్పడం సూపర్బ్. కరోనా టైమ్‌లో ఎవరెలా లబ్ది పొందారో.. ఎవరెలా నష్టపోయారో తెలియదు కానీ తాను మాత్రం ఫిట్‌నెస్ పెంచుకున్నానని.. వెయిట్ లాస్ అయ్యానని చిరు చెప్పారు. సీజన్ 3లో నాగ్‌కి సీజన్ 4లో నాగ్‌కి తేడా కనిపించారా? అని చిరు అడిగారు. అంతా ఏమీ లేదు అనడంతో.. ఏమీ లేదేంటి? తను కూడా మా 60 ఇయర్స్ క్లబ్‌లోకి వచ్చేశారని ఫన్ చేశారు. లోపల నాకు కూడా చిన్న శాడిస్టిక్ ప్లెజర్ ఉందని చిరు చెప్పారు. ఈ మధ్య నాగ్‌కి సంబంధించిన స్టిల్ ఒకటి పంపించారని.. అది చూస్తే కడుపు మండిపోయిందని చిరు చెప్పారు. ఇంకా ఎందరిని ఏడిపించాలని ఇలా తయారవుతున్నాడని చిరు ఫన్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ సీజనే కాదు. 10 వరకూ నాగ్ హోస్ట్‌గా ఉండాలనేది తన కోరిక అన్నారు. బిగ్‌బాస్ ద్వారా నంబర్ 1 ఛానల్ అయ్యిందంటే కంటెస్టెంట్లే కారణమన్నారు. కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు కూడా దీనిని ఓన్ చేసుకున్నారని చిరు చెప్పారు. నాగ్ జర్నీని ఒకసారి చూపించాలని చిరు బిగ్‌బాస్‌ని కోరారు. నాగ్ జర్నీని బిగ్‌బాస్ టీం అద్భుతంగా కట్ చేసింది. అభిపై చిరు పంచ్‌లేయడం చాలా బాగా అనిపించింది. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావని చిరు చెప్పారు. ఐబ్రో పెన్సిల్‌ని వాడి ఎప్పుడైనా ఏదైనా రాశావా.. అంటూ సెటైర్లు వేశారు. అఖిల్.. అటెన్షన్‌ని చాలా గ్రాబ్ చేస్తావని చెప్పారు. స్నేహం, అప్యాయత, అభిమానం, ప్రేమోనాల్ని పంచడంలో ఫస్ట్ ఉంటావని చెప్పారు. అప్పుడు నాగ్ క్లారిటీ అడిగారు. చిరు చాలా స్పాంటీనియస్‌గా ప్రేమల్ని అంటూ కవర్ చేశారు. సొహైల్‌ని సింగరేణి ముద్దు బిడ్డ అంటూ చిరు అదరగొట్టేశారు. మన కథ వేరమ్మా అనే దాన్ని తన సినిమాలో వాడుకుంటానని చెప్పారు. రూ.25 లక్షలు తీసుకుని సొహైల్ డ్రాప్ అయిన విషయాన్ని చిరుకు నాగ్ చెప్పారు.

సొహైల్‌కి బిర్యానీ చేసి పంపిస్తాను ఇస్తారా.. అంటూ తను అడిగానని.. పర్మిషన్ ఇచ్చేసరికి తన కోసం ప్రత్యేకంగా హలాల్ చేసిన బిర్యానీని పంపించిన విషయాన్ని ప్రూఫ్‌తో సహా చూపించారు. తనొక మంచి సినిమా తీస్తానని సపోర్ట్ చేయమని సొహైల్ అడిగారు. దీనికి నాగ్ నా చేతుల మీదుగా నీ సినిమా ప్రమోషన్ చేస్తానని.. వీలైతే నాకు నీ సినిమాలో చిన్న కేమియో రోల్ ఇవ్వమని కోట్లాది ప్రేక్షకుల ముందు మాటిస్తున్నానన్నారు. అరియానాకు నువ్వొక ఫైటర్ అని చిరు చెప్పారు. హారికను చూసి.. ఏవో గుర్తొస్తున్నాయని చె్పారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ఐ లవ్ యూ ఓ హారిక’ సాంగ్ వచ్చింది. ఇండస్ట్రీలో నువ్వో తారలా ఎదిగిపోవాలని కోరుతున్నానన్నారు. మోనాల్ నవ్వుకు తను ఫ్యాన్ అని చెప్పారు. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పారు. అవినాష్ గురించి నీ కెరీర్ ఇప్పటి నుంచి మరోలా ఉంటుందని చెప్పారు. లాస్య నవ్వు అద్బుతంగా ఉంటుందని చెప్పారు. మెహబూబ్‌ని డైనమిక్ బాయ్ అని చెప్పారు. తన చిన్నప్పుడు ఎలా ఉండేవాడినో నిన్ను చూస్తుంటే అలా అనిపించిందన్నారు. నీకు రూ.10 లక్షలు ఇస్తానని మెహబూబ్‌కి చిరు చెప్పారు. వెంటనే చెక్‌పై సైన్ చేసి మరీ ఇచ్చారు. దివి పేరు చెప్పగానే చిరు సిగ్గుపడటం అద్భుతంగా అనిపించింది. ‘వేదాళం’లో అవకాశం ఇవ్వమని తన డైరెక్టర్ మెహర్ రమేష్‌ని కోరానని.. కాబట్టి మనిద్దరం కలిసి చేయబోతున్నామని చెప్పారు. గంగవ్వను.. నీకు చిన్న ఇల్లు కట్టుకోవాలన్న ఆశ.. బిగ్‌బాస్ నెరవేరుస్తుందని చెప్పారు. ఎంత వరకూ వచ్చిందని నాగ్‌ని అడిగారు. గంగవ్వ ఇంటి కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన వీడియోను చూపించారు.

బిగ్‌బాస్ ఫైనలిస్ట్‌ను ప్రకటించే సమయం ఆసన్నమైందని చిరు చెప్పారు. దీంతో నాగ్ వెళ్లి అభిని విన్నర్‌గా ప్రకటించారు. అభికి ఒక అపాచి బైక్ గిఫ్ట్‌గా ఇచ్చారు. నన్ను ఇక్కడి వరకూ తీసుకువచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. అభిజిత్.. నీ పేరులోనే జీత్ ఉందని నాగ్ చెప్పారు. నాగ్, చిరుల మధ్య నిలబడి అవార్డ్ తీసుకుంటానని కానీ.. బిగ్‌బాస్ టైటిల్ తీసుకుంటానని అనుకోలేదని అభి చెప్పాడు. బిగ్‌బాస్ ఇంటికి మహానాయకుడినయ్యానని చెప్పారు. అభి తల్లి మాట్లాడుతూ.. ఒక బాద్ షా, ఒక చక్రవర్తి మధ్య ఉన్న పిల్లల్లో మీ చరిష్మా రావాలని తెలిపారు. మీ ఇద్దరికీ పెద్దవాళ్ల బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పారు. ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పారు. అభి తండ్రి మాట్లాడుతూ.. తన లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ అని చెప్పారు. ఈ బిగ్‌బాస్ హౌస్ ఒక వ్యక్తిత్వ వికాస కేంద్రం అని చిరు చెప్పారు. నాగ్‌కి థాంక్యూ చెప్పి.. ఒక సెల్ఫీ తీసుకుని చిరు బై చెప్పేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.