మే 31న  'అభినేత్రి 2' విడుద‌ల‌

  • IndiaGlitz, [Monday,May 20 2019]

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన 'అభినేత్రి' తెలుగులో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన  'అభినేత్రి 2' మే 31న విడుద‌లవుతుంది.  ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, నందితా శ్వేత, స‌ప్త‌గిరి, సోనూసూద్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. విజ‌య్ ద‌ర్శ‌కుడు.  అభిషేక్ నామా, ఆర్‌. ర‌వీంద్ర‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా.. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మాట్లాడుతూ 'అభినేత్రి' సినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు సీక్వెల్‌గా వ‌స్తున్న 'అభినేత్రి 2' మే 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్ర‌తి ఒక్క‌రినీ అల‌రిస్తుంది.

థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే, మ‌న‌సుకు  న‌చ్చే ఆహ్లాద‌క‌రమైన స‌న్నివేశాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి.  టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, నందితా శ్వేతా పెర్ఫార్మెన్స్ లు హైలైట్ అవుతాయి. శామ్ సంగీతం అంద‌రినీ త‌ప్ప‌క అల‌రిస్తుంది. ఆయంక బోస్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ప్ల‌స్ అవుతుంది. మే 31న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం అని చెప్పారు. 

More News

ఫ్యాన్స్‌కు రేపు సర్‌ఫ్రైజ్ ఇవ్వబోతున్న ప్రభాస్...

‘బాహుబలి’ పార్ట్ 1, పార్ట్2 సినిమాలతో రెబల్ స్టార్ ప్రభాస్‌ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్

సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం

టాలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. బోస్ తల్లి మదనమ్మ సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా గుండెపోటు వ్యాధితో బాధ పడుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై చంద్రబాబు ఏమన్నారంటే...

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు గాను ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడైన సంగతి తెలిసిందే.  ఏపీలో టీడీపీనే అధికారంలోకి వస్తుందని లగడపాటి సర్వే...

మే 31న 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' విడుద‌ల‌

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌'. వాజ్ఞ్మ‌యి క్రియేష‌న్స్ క‌రాటే రాజు స‌మ‌ర్ప‌ణ‌లో విశ్వ‌క్ సేన్ సినిమాస్‌, టెర్ర‌నోవా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌

నాజ‌ర్‌ పై సోద‌రుల ఆరోప‌ణ‌లు

సీనియ‌ర్ న‌టుడు నాజ‌ర్‌ పై అత‌ని సోద‌రులు ఆయ‌బ్‌, జ‌వ‌హ‌ర్ మీడియా ముఖంగా ఆరోప‌ణ‌లు చేశారు. నాజ‌ర్ కుటుంబంలో న‌లుగురు అబ్బాయిలు అందులో చివ‌రి వాడు మాన‌సిక వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు.