'అభినేత్రి 2' మే 31న విడుద‌ల

  • IndiaGlitz, [Thursday,May 23 2019]

ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం 'అభినేత్రి'. ఈ హార‌ర్ కామెడీ చిత్రం మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం 'అభినేత్రి 2'. నందితా శ్వేత, స‌ప్త‌గిరి, సోనూసూద్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. విజ‌య్ ద‌ర్శ‌కుడు.  అభిషేక్ నామా, ఆర్‌. ర‌వీంద్ర‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 31న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. హార‌ర్‌, కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచుతున్నాయి.

సామ్ సి.ఎస్‌. సంగీత సారథ్యంలో ఇటీవ‌ల విడుద‌లైన రెడీ రెడీ.. సాంగ్ చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈరోజు పిల్లండోయ్ ..చ‌క్క‌ని పిల్లండోయ్.. ..కుంకుమ క‌ల‌రండోయ్‌.. చ‌క్క‌ని పిల్లా చ‌క్క‌ర బిల్లా... 'సాంగ్ విడుద‌లైంది. హీరో, హీరోయిన్‌కి త‌న ప్రేమ‌ను టీజింగ్ స్టైల్లో తెలియ‌జేసే సాంగ్ ఇది. ప్ర‌భుదేవా, కోవై స‌ర‌ళ‌, త‌మ‌న్నా, నందితా శ్వేత పెర్ఫామెన్స్ సినిమాకు హైలైట్ కానుంది. 

ఈ చిత్రానికి  సినిమాటోగ్ర‌ఫీ:  ఆయంక బోస్‌, సంగీతం:  శామ్ సి.ఎస్‌., ఎడిటింగ్‌:  ఆంటోని.

More News

ఏపీ ఎన్నికల ఫలితాలు : మినిట్ టూ మినిట్.. అప్‌డేట్స్

ఏపీ ఎన్నికల ఫలితాలు : మినిట్ టూ మినిట్.. అప్‌డేట్స్

12కే ట్రెండ్స్.. 2కు తొలి ఫలితం.. అర్ధరాత్రి ‘ఏపీ’ తుది ఫలితాలు!

సుమారు 42 రోజుల పాటు నరాలు తెగే ఉత్కంఠ.. ఓటరు దేవుడయితే తీర్పు ఇచ్చేశాడు కానీ.. ఫలితమే చాలా ఆస్యమైంది. దీంతో అసలు తాము నెగ్గుతామో లేదో అభ్యర్థులు..

అబద్ధాల రవిప్రకాష్... 11 అసలు నిజాలు బయటపడ్డాయ్! 

టీవీ9 వివాదంలో పరారీలో ఉన్న మాజీ సీఈవో రవిప్రకాష్ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సుమారు ఎనిమిది నిమిషాలకుపైగా నిడివి గల ఈ వీడియోలో అసలు కేసులు సంగతేంటి..?

టీవీ9 రవిప్రకాష్‌కు హైకోర్టులో ఊహించని షాక్..

టీవీ9 వివాదంలో పోలీసుల దొరకకుండా పరారీలో ఉన్న మాజీ సీఈవో రవిప్రకాష్‌కు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఇప్పటికే పోలీసుల ఎదుట హాజరుకాకుండా ముందస్తు బెయిల్

‘సీత’ సినిమాతో శ్రీనివాస్ 'ఉయ్..' అనిపిస్తాడా..!?

యువ కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న  చిత్రం ‘సీత’. తేజ దర్శకత్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ‌బ్రహ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.