అభినేత్రి నిర్మాత ఎం.వి.వి స‌త్య‌నారాయ‌ణ అరెస్ట్..!

  • IndiaGlitz, [Saturday,September 17 2016]

గీతాంజ‌లి, శంక‌రాభ‌ర‌ణం, అభినేత్రి చిత్రాల నిర్మాత, ఎం.వి.వి బిల్డ‌ర్స్ అధినేత ఎం.వి.వి. స‌త్యనారాయ‌ణ‌ను భూ ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ పై విశాఖ‌ప‌ట్నం పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ మేరకు డీసీసీ సీహెచ్ వెంకటేశ్వరరావు స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న మ‌ధుర‌వాడ‌లో పంచాయితీ అనుమ‌తి పొందిన లే అవుట్ లో ఉత్త‌రాంధ్ర జిల్లాల‌తో పాటు వివిధ ప్రాంతాల‌కు చెందిన మొత్తం 88 మందికి స్ధ‌లాలు ఉన్నాయి. ఈ 88 మంది స్ధలాల్లో 38 మంది స్ధలాల‌ను సేక‌రించి విశాఖ‌ప‌ట్నం సిటీ పేరుతో గృహ‌నిర్మాణ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.

అయితే...38 మంది స్ధలాలు కాకుండా మిగిలిన వాళ్ల స్ధలాలు ఆక్ర‌మించి రోడ్డు నిర్మిస్తున్నార‌నేది ఆరోప‌ణ‌. త‌మ స్ధలాన్ని ఎం.వి.వి స‌త్య‌నారాయ‌ణ ఆక్ర‌మించార‌ని శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన జ‌డ్డు విష్ణుమూర్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ప్రాధ‌మికంగా ఆరోప‌ణ‌లు రుజువుకావ‌డంతో ఎం.వి.వి. స‌త్య‌నారాయ‌ణ‌ను ఆయ‌న నివాసంలో అదుపులోకి తీసుక‌న్నారు. అయితే...అరెస్ట్ అనంత‌రం గుండె నొప్పి వ‌స్తుంది అన‌డంతో ఎం.వి.వి.స‌త్యనారాయ‌ణ‌ను చికిత్స నిమిత్తం కె.జి.హెచ్ కి త‌ర‌లించామ‌ని పోలీసులు తెలియ‌చేసారు. ఇదిలా ఉంటే... ఎం.వి.వి స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ...నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే నిర్మాణాలు చేప‌ట్టాను. ఇదంతా టి.డి.పి నాయ‌కుడు క‌ళా వెంక‌ట్రావు కుట్ర అని ఆరోపించారు.

More News

వెంకీ గురు ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది..!

విక్ట‌రీ వెంక‌టేష్ బాలీవుడ్ మూవీ సాలా ఖ‌ద్దూస్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్ కోచ్ గా న‌టిస్తున్నారు.

ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావ‌డం సంతోషంగా ఉంది - సాగ‌ర్

సాగ‌ర్, రాగిణి, సాక్షి చౌద‌రి హీరో, హీరోయిన్స్ గా ద‌యానంద‌రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మించారు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన సిద్దార్ధ చిత్రం ఈనెల 16న రిలీజైంది.

చిరంతన్‌ భట్‌ సంగీత దర్శకత్వంలో 'గౌతమి పుత్ర శాతకర్ణి' పాట చిత్రీకరణ

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై రూపొందుతోన్న ప్రెస్టిజియస్‌ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సూప‌ర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా నందిని న‌ర్సింగ్ హోమ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ హీరోగా గిరి తెర‌కెక్కించిన చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్. ఈ టైటిల్ కి ఇక్క‌డ అంతా క్షేమ‌ము అనేది ట్యాగ్ లైన్.

ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తున్న మ‌న ఊరి రామాయ‌ణం ట్రైల‌ర్..!

జాతీయ ఉత్త‌మ నటుడు ప్ర‌కాష్ రాజ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న తాజా చిత్రం మ‌న ఊరి రామాయ‌ణం. తెలుగు, క‌న్న‌డ‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్, ప్రియ‌మ‌ణి, స‌త్య‌దేవ్, పృథ్వీ, ర‌ఘుబాబు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.