close
Choose your channels

తనను ట్రోల్ చేసిన నెటిజన్‌కి.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన అభిషేక్..

Friday, July 31, 2020 • తెలుగు Comments

తనను ట్రోల్ చేసిన నెటిజన్‌కి.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన అభిషేక్..

ఎవరైనా కరోనా బారిన పడ్డారంటే.. ఎవరమైనా త్వరగా కోలుకోవాలనే ఆశిస్తాం. అసలు మనకు ఏదైనా హాని చేసిన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బంది ఎదురైనా కూడా చనిపోవాలనైతే కోరుకోం. కానీ బిగ్‌బి, అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ విషయంలో మాత్రం ఇది రివర్స్ అవుతోంది. వారు మనకు చేసిన హాని ఏమాత్రమూ లేదు కదా.. కనీసం మనమెవరో కూడా వారికి తెలియదు. కానీ అమితాబ్ చనిపోవాలని ఒకరు ట్వీట్.. మీ నాన్న ఆసుపత్రిలో ఉన్నాడు కదా. మరి ఎవరి భరోసాతో కూర్చొని తింటున్నావంటూ మరొకరు అభిషేక్‌ని ట్రోల్ చేస్తున్నారు.

ట్రోలర్స్‌కి వీరిచ్చే సమాధానాల మాట ఎలా ఉన్నా కూడా ఇలా ట్రోల్స్ చేయడం మాత్రం ఒకింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అమితాబ్ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్‌‌లకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల వీరిద్దరిపై ట్రోల్స్ బాగా పెరిగాయి. ఒకరు అమితాబ్‌ కరోనాతో చనిపోతారంటూ‌ కామెంట్ పెడితే.. దానికి ఆయన చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. కానీ అభిషేక్ అలా కాదు.. కూల్‌గా ట్రోలర్‌కి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు.

‘మీ నాన్న ఆసుపత్రిలో ఉన్నారు కదా. మరి ఎవరి భరోసాతో కూర్చొని తింటావ్?’ అని ప్రశ్నించింది. ట్వీట్‌పై అభిషేక్ స్పందిస్తూ.. ‌’ప్రస్తుతానికి కూర్చొని కాదు. పడుకుని భోజనం చేస్తున్నా. మా నాన్న కూడా నాతోనే ఆసుపత్రిలో ఉన్నారు’ అంటూ కూల్ రిప్లై ఇచ్చారు. అవతలి వాళ్లకు మాత్రం దిమ్మతిరిగి పోయి ఉంటుంది. ఆ తరువాత ఆ నెటిజన్‌ ‘త్వరగా కోలుకోండి సర్‌. ఎవరి రాత‌ ఎలా ఉందో ఎవరూ చెప్పలేరు’ అంటూ కామెంట్‌ పెట్టగా.. ‘మీకు ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను ప్రార్థిస్తున్నా. మీ విషెస్‌కి ధన్యవాదాలు’ అని మరోసారి అభిషేక్‌ షాక్ ఇచ్చారు. దీంతో అభిషేక్ ఫ్యాన్స్ నెటిజన్‌పై ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతూనే.. అభిషేక్ ఇచ్చిన రిప్లైకి ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz