'ఇండియన్ 2' లో అభిషేక్ బచ్చన్
Send us your feedback to audioarticles@vaarta.com
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఇండియన్ 2`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం చెన్నైలో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటించబోతున్నాడని వార్తలు వినిపించాయి.
ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో `2.0`లో అక్షయ్‌కుమార్ నటించాడు. కాగా సినిమాలో మరో పవర్ఫుల్ పాత్ర ఉంటుందట. ఆ పాత్రలో మరో బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్‌ను నటింప చేయాలని అనుకుంటున్నాడట శంకర్. ఆ దిశగా అభిషేక్ బచ్చన్‌ను కూడా యూనిట్ కలిశారని, ఆయన కూడా సానుకూలంగానే స్పందించాడని సమాచారం. అంతా ఓకే అయితే శంకర్ మరో పేన్ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్నట్లేగా..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.