దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. 45వేల మందికి పైగా మృతి

  • IndiaGlitz, [Tuesday,August 11 2020]

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతి రోజూ 50 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. కరోనాతో ఇప్పటి వరకూ 45 వేల మందికి పైగా మృతి చెందారు. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 53,601 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 22,68,675కు చేరుకుంది.

తాజాగా కరోనాతో 871 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 45,257 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 6,39,929 యాక్టివ్ కేసులున్నాయి. 15,83,489 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లోనే 47,746 బాధితులు కోలుకోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 69.80% ఉండగా.. మరణాల రేటు 1.99% ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

More News

బాలీవుడ్‌కి ‘వినాయకుడు’.. కృష్ణుడి పాత్రలో..

భారీ బడ్జెట్‌.. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. కానీ చిన్న బడ్జెట్‌తో

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు... నేడు ఎన్నంటే..

తెలంగాణలో నిన్నటితో పోలిస్తే నేడు కరోనా కేసులు పెరిగాయి. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

ఎంట్రన్స్ పరీక్షల తేదీలు ఖరారు..

తెలంగాణలో ఎంట్రన్స్ టెస్టులను గతంలో ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఏపీ, కేంద్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన కేసీఆర్

అటు ఏపీ.. ఇటు కేంద్ర ప్రభుత్వాలపై నేడు సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. నేడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సోమవారం జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు.

హీరో సూర్య‌కు షాకిచ్చిన డైరెక్ట‌ర్‌..?

అటు త‌మిళ ఇటు తెలుగులో త‌న సినిమాల‌కు ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న అతి కొద్ది మంది హీరోల్లో సూర్య ఒక‌రు.