మళ్ళీ వాయిదా పడ్డ 'ఆచారి అమెరికా యాత్ర'?

  • IndiaGlitz, [Monday,April 02 2018]

క‌థానాయ‌కుడు మంచు విష్ణు, ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో వ‌చ్చిన ‘దేనికైనా రెడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా వీరిద్ద‌రి కలయికలో ముచ్చ‌ట‌గా మూడోసారి ‘ఆచారి అమెరికా యాత్ర’ పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక కాగా.. కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటించారు. బ్రహ్మానందం క‌థ‌కు కీలకమైన‌ పాత్రలో సందడి చేయనున్నారు.

పద్మజ పిక్చర్స్ బ్యానర్‌పై కీర్తి చౌదరి, ఎం.ఎల్.కుమార్ నిర్మించిన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ విడుద‌ల‌కు ముందే మంచి బజ్‌ను సాధించింది. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల  జనవరి 26న విడుదల కావలసిన ఈ సినిమా ఈ నెల 6వ తేదీకి వాయిదా పడింది. కాని తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం మరోసారి వాయిదా పడింద‌ని.. ఈ నెల 26న విడుదలకు సిద్ధం కాబోతోందని తెలుస్తోంది. మరి ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా.. మూడోసారైనా స‌రైన స‌మ‌యానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందో, లేదో చూడాలి.

More News

శ్రియ ఆ సినిమా చేయ‌డం లేదా?

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో ‘ఆటా నాదే వేటా నాదే’ (ప్రచారంలో ఉన్న పేరు) సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

'సాహో'.. ఫ్యాన్స్‌ కోసం సూపర్ ప్రోమో

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో'.

నాగ్‌, నాని మూవీ సెకండ్ షెడ్యూల్ అప్‌డేట్‌

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే

'రంగస్థలం 2' పై స్పందించిన సుకుమార్

ఈ శుక్ర‌వారం విడుదలైన 'రంగస్థలం' అన్ని సెంట‌ర్ల‌లోనూ విజయదుందుభి మోగిస్తోంది. రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు.

ఏప్రిల్‌ 7న భరత్‌ బహిరంగ సభ

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో