మలేసియాలో 'ఆచారి అమెరికా యాత్ర' మూడో షెడ్యూల్

  • IndiaGlitz, [Sunday,July 16 2017]

మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచారి అమెరికా యాత్ర". "దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం" లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు-జి.నాగేశ్వర్రెడ్డిల కాంబిణేషన్ లో తెరకెక్కనున్న మూడో చిత్రమిది. హైద్రాబాద్ లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న చిత్ర బృందం ప్రస్తుతం మలేసియాలో తాజా షెడ్యూల్ ను మలేసియాలో నిర్వహిస్తోంది. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "మంచు విష్ణు సరసన కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలకపాత్ర పోషిస్తున్నారు. విష్ణు-బ్రహ్మానందంల కాంబినేషన్ హిలేరియస్ గా నవ్విస్తుంది. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి ఆద్యంతం అలరించేలా ఓ మంచి కథను సమకూర్చారు. ప్రస్తుతం మలేసియా షెడ్యూల్ లో భారీ క్యాస్టింగ్ తో నాగేశ్వర్రెడ్డి హిలేరియస్ సీన్స్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ అనంతరం టీం మొత్తం అమెరికా వెళ్లనున్నాం. అక్కడ మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేశాం" అన్నారు.
విష్ణు మంచు, ప్రగ్యా జైస్వాల్, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, కోట శ్రీనివాసరావు, ఎల్.బి.శ్రీరామ్, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, పృథ్వి, ప్రవీణ్, అనూప్ ఠాకూర్ సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, కళ: కిరణ్, ఫైట్స్: సెల్వ, మాటలు: డార్లింగ్ స్వామి, సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: సిద్దార్థ, నిర్మాతలు: కీర్తి చౌదరి-కిట్టు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వర్రెడ్డి!

More News

డైరెక్టర్ జయగారు నన్నెంతో ఇన్ స్పైర్ చేశారు - అవంతిక

'చంటిగాడు','గుండమ్మగారి మనవడు','లవ్ లీ'వంటి యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ను రూపొందించి దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు

'దర్శకుడు' ఆడియో విడుదల చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

సుకుమార్ నిర్మాత గా మారి సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్సీఎస్ పీ విజయ్కుమార్,థామస్రెడ్డి ఆదూరి,రవిచంద్ర సత్తిలతో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'దర్శకుడు'.

మెగాభిమానులకు చరణ్ గిఫ్ట్

రామ్ చరణ్,సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న 'రంగస్థలం 1985'.

40 రోజుల పాటు మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ : అఖిల భారత చిరంజీవి యువత

ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి నిశ్చయించిన సంగతి తెలిసిందే.

తాప్పీ క్షమాపణ

శతాధిక దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఎంతో మంది కొత్త హీరోయిన్స్ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. వారిలో తాప్సీ కూడా ఒకటి.