‘పుష్ప’ లొకేష‌న్‌కు ‘ఆచార్య‌’..!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇందులో సిద్ధ అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మెసేజ్ ఓరియెంటెడ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ‘ఆచార్య‌’ కోసం కోకాపేట‌లో వేసిన భారీ టెంపుల్ సెట్‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. తదుప‌రి ఫారెస్ట్ ఏరియాలో కొన్ని కీల‌క స‌న్నివేశాలను చిత్రీక‌రించాల్సి ఉంద‌ట‌. దీని కోసం ఆచార్య యూనిట్ మారేడు మిల్లికి వెళుతున్నార‌ని టాక్‌. పుష్ప షూటింగ్ జరిగిన ప్రాంతంలోనే ‘ఆచార్య‌’ కొత్త షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌.

పుష్ప షూటింగ్ స‌మ‌యంలో ఓ స్పెష‌ల్ గెస్ట్ హౌస్‌ను నిర్మించార‌ట సుకుమార్ అండ్ టీమ్‌. ‘ఆచార్య‌’ యూనిట్ కూడా అక్క‌డే బ‌స చేస్తార‌ని అంటున్నారు. ఈ షెడ్యూల్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేల‌పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తార‌ట‌. దేవాదాయ శాఖ‌లోని అవినీతిని ప్ర‌శ్నించేలా ‘ఆచార్య‌’ సినిమాను కొర‌టాల తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ‘ఆచార్య‌’ను మే 13న విడుద‌ల చేస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, సోనూసూద్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

More News

క్రేజీ కాంబినేష‌న్‌పై మైత్రీ మూవీస్ క‌న్ను...

పెళ్లిచూపులుతో హీరోగా సాలిడ్ హిట్ కొట్టి బ్రేక్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ. తదుపరి చిత్రం అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు.

మెగా ఫ్యామిలీతో కీర‌వాణి సెంటిమెంట్‌..!

మెగాస్టార్‌.. ఆయ‌న న‌ట వార‌సులుగా ఇండ‌స్ట్రీలో చాలా మంది ప‌రిచ‌యం అయ్యారు. అయితే ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి

‘స‌లార్‌’ .. ప్ర‌శాంత్ నీల్ స్పీడు మామూలుగా లేదుగా..!

ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన త‌ర్వాత ఆయ‌న కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు.

ఉప్పెన' క్లైమాక్స్ ట్రోల్స్ పై వైష్ణవ్ తేజ్ స్పందన

ఉప్పెన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగడానికి రెండు మూడు రోజుల ముందు నుంచి సోషల్ మీడియాలో సినిమా క్లైమాక్స్ గురించి విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ప్రమాదకరమైన సన్నివేశం ఒకటుందనీ

నెటిజన్‌ కామెంట్‌కు దిమ్మదిరిగేలా 'రంగమ్మత్త' రిప్లయ్!

సినిమా సెలబ్రిటీలపై.. మరీ ముఖ్యంగా నటీమణులపై నిత్యం ఎవరో ఒకరు విమర్శించడం.. సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా కామెంట్స్ చేయడం కొందరు నెటిజన్లకు షరామామూలైపోతోంది.