ఆచార్య అప్డేట్: చిరు, చరణ్ పిక్ చూశారా, ఇక రెండు సాంగ్స్ మాత్రమే!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పరాజయం ఎరుగని కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో మెగా ఫ్యాన్స్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు.

ఆ మధ్యన విడుదలైన టీజర్ అంచనాలని తారాస్థాయికి చేర్చింది. కొరటాల శివ తన మార్క్ దర్శకత్వంతో మెసేజ్, కమర్షియల్ అంశాలని మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ పలుమార్లు వాడిదా పడుతూ వచ్చింది. దీనితో అభిమానులకు పడిగాపులు తప్పలేదు.

ఇటీవల బడా చిత్రాలన్నీ రిలీజ్ డేట్లు ఖరారు చేసుకున్నాయి. దీనితో ఆచార్య చిత్రం నుంచి కూడా అప్డేట్ కావాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ షురూ చేశారు. దీనితో చిత్ర యూనిట్ తాజాగా ఆచార్య అప్డేట్ అందించింది. అప్డేట్ తో పాటు రాంచరణ్, చిరంజీవి నక్సలైట్స్ ని తలపించే కాస్ట్యూమ్స్ లో ఉన్న లొకేషన్ పిక్ ని షేర్ చేశారు.

ఆచార్య టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని, ఇక రెండు సాంగ్స్ ని చిత్రీకరించాల్సి ఉందని ప్రకటించారు. రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఈ చిత్రం దసరా సీజన్లో రానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ కు జోడిగా ఈ మూవీలో కాజల్ అగర్వాల్ అవకాశం దక్కించుకుంది. రాంచరణ్ సిద్ధ పాత్రలో కీలకమైన కామియో రోల్ చేస్తున్నాడు. మణిశర్మ సంగీత దర్శకుడు.

More News

ఐదు భాషలలో 'దెయ్యంతో సహజీవనం' చిత్రం టీజర్ విడుదల

నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…).

సురేఖ వాణిపై రూమర్స్.. పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి తరచుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ సూపర్ పాపులారిటీ సొంతం చేసుకుంది సురేఖ వాణి.

'RRR' ఫ్లైట్ లో బాహుబలి నిర్మాత.. రాంచరణ్ సెల్ఫీ వైరల్

ఆర్ఆర్ఆర్ టీం ఫైనల్ షెడ్యూల్ కోసం ఉక్రెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే.

'సర్కారు వారి పాట' నుంచి అర్జున్ అవుట్.. జగ్గూభాయ్ ఇన్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు.

తన కొడుకుకి నామకరణం చేసిన స్టార్ హీరో.. బ్యూటిఫుల్ పిక్ వైరల్

నటుడు శివకార్తికేయన్ తమిళ స్టార్ హీరోల్లో ఒకరు. వరుస విజయాలతో శివకార్తికేయన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.