మెద‌టిసారిగా క‌లిసి న‌టిస్తున్న‌ అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి

  • IndiaGlitz, [Thursday,January 21 2021]

ప్ర‌ముఖ న‌టుడు డాక్ట‌ర్ అలీ నిర్మాత‌గా అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకాం పై తెర‌కెక్కుతున్న చిత్రం అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి. డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌య కృష్ణాన‌రేశ్ ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవ‌లే అంగ‌రంగ వైభవంగ మొద‌లైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఈ సినిమాలో ప్ర‌ముఖ నిర్మాత అచ్చిరెడ్డి, ప్ర‌ముఖ సీనియర్ ద‌ర్శ‌కుడు కృష్ణారెడ్డి న‌టిస్తుండ‌టం విశేషం. ఇప్ప‌టివ‌రుకు తెర‌వెనుక‌నే ఉంటూ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని తెలుగు చిత్ర‌సీమ‌కు అందించిన ఈ దిగ్గజ‌ద్వయం తొలిసారిగా వెండితెర మీద‌కు రాబోతున్నారు. గ‌తంలో ఎస్ వీ కృష్ణా రెడ్డి హీరోగా ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ, అచ్చిరెడ్డిగారితో క‌లిసి న‌టించ‌డం ఇదే మొద‌టిసారి అవుతుంది డాక్ట‌ర్ అలీని హీరోగా ఇంట‌ర్ డ్యూస్ చేసి, ఆయ‌న కెరీర్ ని ఓ కీల‌క మ‌లుపు తిప్పిన అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి ఇప్పుడు ఆయ‌న కోరిక మేర‌కు సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించ‌డం విశేషం.

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ అలీ మాట్లాడుతూ.. న‌న్ను హీరోగా ఇంట‌ర్ డ్యూస్ చేసి నా కెరీర్ ని కీల‌క మ‌లుపు తిప్పిన అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డిగారికి మ‌ళ్లీ నేను నిర్మాతగా మారి తెర‌కెక్కిస్తున్న అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి లో అవ‌కాశం ఇవ్వ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, ఈ సినిమాలో వారిద్ద‌రి పాత్ర చిన్న‌దైన‌ప్ప‌టికీ నా మీద అభిమానంతో న‌టించ‌డానికి అంగీక‌రించార‌ని డాక్ట‌ర్ అలీ అన్నారు. తాజాగా జ‌రిగిన షెడ్యూల్ లో అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి మీద కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీపురం కిర‌ణ్ చిత్రీక‌రించారు. మ‌ళ‌యాలీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ వికృతికి తెలుగు రీమేక్ సినిమాగా అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి రాబోతుంది. ఈ సినిమాలో యువ న‌టి మౌర్యానీ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవుతాయి

తారాగాణం: డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌యకృష్ణ న‌రేశ్, మౌర్యానీ, ప‌విత్ర లోకేశ్ త‌దిత‌రులు

More News

‘మెగా’ టాస్క్‌‌ను తమన్ ఎలా కంప్లీట్ చేస్తారో..?

ప్రస్తుతమున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌లో తమన్ టాప్‌లో ఉన్నారు. తాజాగా ఆయన అదిరిపోయే ఛాన్స్ కొట్టేశారు.

మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్ సిద్ద‌మ‌వుతోందా..!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

సూర్య సినిమాలో ర‌ష్మిక ప్లేస్ ప‌ట్టేసిన శర్వానంద్ హీరోయిన్‌..!

హీరో సూర్యకు గత ఏడాది బాగానే క‌లిసొచ్చింది. ఎందుకంటే చాలా రోజులుగా ఓ మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సూర్య‌కు 2020లో విడుద‌లైన ‘ఆకాశం నీహ‌ద్దురా’ చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది.

నెట్టింట వైర‌ల్ అవుతోన్న మ‌హేశ్ ఫిట్‌నెస్ వీడియో

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. కోవిడ్ స‌మ‌యంలోనూ త‌న ఫ్యామిలీతో ఉంటున్న ఫొటోలు, చిన్న వీడియోలు షేర్ చేశారు

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం

అగ్రరాజ్యం అమెరికా మరో నవ శకానికి నాందిగా మారింది. సెంట్‌ మాథ్యూ చర్చ్‌లో ప్రార్థనల అనంతరం..