యాక్ష‌న్ హీరోను ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ చేస్తున్న మారుతి..!

  • IndiaGlitz, [Monday,December 28 2020]

ఓ సినిమా సెట్స్‌లో ఉండ‌గానే మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌మే కాకుండా.. సినిమా ముగియ‌గానే కొత్త సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. అందులో భాగంగా ఇటీవ‌ల డైరెక్ట‌ర్ మారుతితో చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపించాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యింది కూడా. అయితే ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో బెట్టు చేయ‌డంతో ప్రాజెక్ట్‌పై ర‌వితేజ ఆస‌క్తి చూపించ‌లేదు. దీంతో నిర్మాత‌లు ఇప్పుడు మ‌రో హీరోను ఈ సినిమాలో న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల‌కు మేర‌కు యువీ క్రియేష‌న్స్‌కు స‌న్నిహితుడైన హీరో గోపీచంద్ ఇప్పుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌.

ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్ చల్ చేస్తుంది. అదేంటంటే.. మారుతి సినిమాలో హీరో లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడు. డ‌బ్బు కోసం ఎలాంటి కేసునైనా వాదిస్తుంటాడు. అందుక‌నే ఈ సినిమా మారుతి ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌’ అనే టైటిల్‌ను కూడా అనుకున్నాడ‌ట‌. యాక్ష‌న్ ఇమేజ్ ఉన్న గోపీచంద్‌ను త‌న‌దైన ఎంట‌ర్‌టైన్‌మెంట్ యాడ్ చేసి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ కోణంలో మారుతి చూపిస్తాడ‌న్న‌మాట‌. గోపీచంద్ డేట్స్‌ను ఇస్తే..ఇక సినిమాను అధికారికంగా ప్ర‌క‌టించడ‌మే త‌రువాయి అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

More News

మోదీ గడ్డం వెనుక అసలు కారణం ఇదేనట...

ప్రధాని మోదీ ఇటీవల కొంతకాలంగా తెల్లటి గడ్డంతో మెరిసిపోతున్నారు.

క్రేజీ టైటిల్‌.. స్టార్ ప్రొడ్యూస‌ర్‌తో క‌ల్యాణ్‌రామ్‌..!

ఒక‌వైపు హీరోగా, మ‌రోవైపు నిర్మాత‌గా సినిమా రంగంలో బిజీగా ఉంటున్న వ్య‌క్తి నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌.

రిలయన్స్‌ జియోపై యుద్ధం ప్రకటించిన రైతులు..

గత కొన్ని రోజులుగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్రంపై యుద్ధానికి దిగిన రైతులు తాజాగా రిలయన్స్ కంపెనీపై తమ యుద్ధాన్ని ప్రకటించారు.

గుణ‌శేఖర్ శ‌కుంత‌ల‌గా ఈ స్టార్ హీరోయిన్ క‌నిపించ‌నుందా..?

బ‌డ్జెట్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాకుండా భారీ సెట్స్ వేసి చిత్రీక‌రించే ద‌ర్శ‌కుల్లో గుణ‌శేఖ‌ర్ ఒక‌డు. ఈయ‌న పేరు వింటే.. త‌ను చేయ‌బోయే సినిమా కోసం ఎలాంటి సెట్స్ వేస్తాడోన‌ని ప్రేక్ష‌కుడు ఆలోచిస్తాడు.

2021లో ధరల మోత మోగించనున్న గృహోపకరణాలు

2021లో కరోనా మహమ్మారి మాటేమో కానీ.. ధరల పెరుగుదల మాత్రం ప్రజానీకాన్ని బెంబేలెత్తిస్తోంది. ఎల్‌ఈడీ టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు వంటి కీలకమైన గృహోపకరణాల ధరలు జనవరి నుంచి 10 శాతం మేరకు పెరిగే