close
Choose your channels

విశాల్‌ కెరీర్ లోనే 'యాక్షన్' హైయెస్ట్ గ్రాసర్ అవుతుంది - నిర్మాత శ్రీనివాస్‌ ఆడెపు

Thursday, November 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విశాల్‌ కెరీర్ లోనే  యాక్షన్ హైయెస్ట్  గ్రాసర్ అవుతుంది - నిర్మాత శ్రీనివాస్‌ ఆడెపు

'హుషారు', 'కబాలి', 'ఇస్మార్ట్‌ శంకర్‌', 'గద్దలకొండ గణేష్‌', 'రాజుగారిగది3 ' వంటి చిత్రాలను సక్సెస్ ఫుల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రస్తుతం 'యాక్షన్' మూవీతో నిర్మాతగా మారారు శ్రీనివాస్‌ ఆడెపు. మాస్‌ హీరో విశాల్‌, తమన్నా హీరోహీరోయిన్లుగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'యాక్షన్‌' శ్రీనివాస్‌ ఆడెపు నిర్మాతగా శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై 'యాక్షన్‌' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్‌15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత, శ్రీకార్తికేయ సినిమాస్‌ అధినేత శ్రీనివాస్‌ ఆడెపు ఇంటర్వ్యూ..

మీ గురించి చెప్పండి

నేను గత 18 సంవత్సరాలుగా ఇండస్ట్రీ లో ఉన్నాను. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌ చేశాను. అది అంత శాటిస్ఫాక్షన్‌ ఇవ్వలేదు. తర్వాత డైరెక్టర్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. ఆ క్రమంలోనే 6-7 సినిమాలకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. ఆతర్వాత ఎగ్జిబిటర్ గా మారి కొన్ని సినిమాలకు వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ గా మారి 'హుషారు', 'కబాలి', 'ఇస్మార్ట్‌ శంకర్‌', 'గద్దలకొండ గణేష్‌', 'రాజుగారిగది3 ' లాంటి సినిమాలు చేశాను. అన్ని సినిమాలు నాకు మంచి పేరు తీసుకువచ్చాయి. అలాగే ఇప్పుడు యాక్షన్ చిత్రంతో నిర్మాతగా మీ ముందుకు వస్తున్నాను.

ఈ సినిమాతోనే నిర్మాతగా మారడానికి కారణం ఏంటి?

యాక్షన్ మూవీ టీజర్ చూడగానే నాకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించి వెంటనే వెళ్లి ఆ సినిమా రైట్స్ కొనడం జరిగింది. నేను డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ గా రాణించడంతో వారు ఒప్పుకున్నారు. నేను ఇదివరకే నా స్నేహితుడితో కలిసి ఒక సినిమా ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సినిమా బ్యానేర్ లో రిలీజయ్యే మొదటి సినిమా. అలాగే దాదాపు 600 థియేటర్స్ కి పైగా ఈ సినిమా విడుదలవుతుంది. మా బేనర్ లో ఫస్ట్ మూవీ నే ఇంత లార్జర్ స్కెల్ లో రిలీజవడం చాలా సంతోషంగా ఉంది.

యాక్షన్ మూవీ ఎలా ఉండబోతుంది?

యాక్షన్ మూవీ ఆడియన్స్ కి, విశాల్ అభిమానులకి ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది. సినిమా చాలా గ్రాండియర్ గా ఉండి యాక్షన్ సీక్వెన్సులు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా నేను తీసుకోవడానికి ఈ సినిమా మేకింగ్ కూడా ఒక కారణం. అలాగే కెజిఎఫ్ సినిమాకు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అంబు, రవి వర్మ ఈ సినిమాకు వర్క్ చేశారు. ఆ సినిమాలో హీరో ఎలివేషన్స్ ని మనం ఇప్పటికి మరచిపోలేము. ఈ సినిమాతో మరో సారి ఆ ఎలివేషన్స్ కి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం.

డైరెక్టర్ సుందర్.సి గురించి?

డైరెక్టర్ సుందర్. సిగారి గురించి చెప్పేంత పెద్ద వాడిని కాదు. ఆయన సినిమాల గురించి మనకు తెలిసిందే. నాకు ఆయన సినిమాల్లో 'సత్యం శివమ్' మూవీ చాలా ఇష్టం. అయితే ఈ సినిమా ఆయన అన్ని సినిమాలకు డిఫరెంట్ గా ఉంటుంది. ఎలాగైనా విశాల్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వాలని కసితో ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు.

డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీ కి వచ్చారు కదా! మీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టం?

నాకు పర్సనల్ గా హ్యూమన్ ఎమోషన్స్ ని క్యారీ చేసే మూవీస్ అంటే ఇష్టం. దర్శకుడిగా తప్పకుండా త్వరలోనే మంచి మూవీ తీస్తాను. 'రుద్ర వీణ' సినిమా చూసి నేను ఇండస్ట్రీ కి రావడం జరిగింది.

డిస్ట్రిబ్యూటర్ గా ఉండడం కష్టమా? నిర్మాతగా ఉండడం కష్టమా?

నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఉండడం రెండు కష్టమే. ఎందుకంటే ఇండస్ట్రీలో దేని పోరాటం దానిదే.

రానా గారితో రాప్ సాంగ్ చేపించాలనే ఆలోచన ఎవరిది?

అది నేను విశాల్ అన్న కూర్చొని అనుకోవడం జరిగింది. తెలుగులో ఏదయినా సంథింగ్ స్పెషల్ అనేలా ఉండాలి అనుకోని రాప్ చేపించడం జరిగింది. రానా గారి వాయిస్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు తెలుసు అందుకే నేను విశాల్ అన్న అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్‌తమిళ కూర్చొని ఈ సాంగ్ చేశాం. ఆ పాటకు మంచి క్రేజ్ వచ్చింది.

హీరోయిన్ తమన్నా గురించి?

తమన్నా ఎంత మంచి పెర్ఫార్మర్ అనేది తెలుసు. అయితే గొప్ప చారిత్రాత్మక చిత్రం 'సైరా' లో ఆమె రోల్ కి మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. ఈ సినిమాలో కూడా చాలా కష్టమైన యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం జరిగింది. తప్పకుండా యాక్షన్ సినిమా కూడా ఆమెకి మంచి పేరు తీసుకువస్తుంది అని నమ్ముతున్నాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.