యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ప్రెస్‌నోట్‌

  • IndiaGlitz, [Monday,August 23 2021]

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ ఆగస్టు 20, 2021న మీడియా సమావేశం నిర్వహించింది. దానికి సంబంధించిన ఈ ప్రెస్‌నోట్‌ విడుదల చేస్తున్నాం.

మన చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులను కించపరిచేలా తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫీసర్‌ బేరర్స్‌ సమక్షంలో పలువురు చేసిన వ్యాఖ్యలను యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తీవ్రంగా ఖండిస్తోంది.

మేం మళ్లీ మళ్లీ చెప్పేది ఏంటంటే...

తొలుత సినిమా నిర్మాణాన్ని ప్రారంభించేది నిర్మాతే. నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి సినిమాకు పునాది వేసేది నిర్మాతే. ప్రాథమికంగా థియేటర్లలో విడుదల చేయాలని ఎల్లప్పుడూ భావిస్తాడు. గతంలో శాటిలైట్‌, ఇప్పుడు వివిధ ఓటీటీ మాధ్యమాల రాకతో... ఈ మార్గాలు అన్నిటి ద్వారా నిర్మాత తన పెట్టుబడిని రాబట్టుకుంటాడు. తన చిత్రాన్ని ఎప్పుడు, ఎక్కడ విడుదల చేయాలనే నిర్ణయం తీసుకునే హక్కు నిర్మాతది.

ఓటీటీ మాధ్యమంలో తమ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న హీరో, నిర్మాతను సభాముఖంగా విమర్శించడం, వ్యక్తిగతంగా బెదిరించడం సరికాదు. ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం అనిపించుకోదు. తన చిత్రంపై సర్వహక్కులు నిర్మాతకు చెందుతాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో మార్కెట్‌ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. అందువల్లే, పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేకంగా ఒక హీరోను ఎవరైనా టార్గెట్‌ చేయడం ద్వారా పరిశ్రమలోని ఆరోగ్యకర, స్నేహపూర్వక సంబంధాలను దెబ్బ తీస్తుంది. నిర్మాతలు/హీరోలు/సాంకేతిక నిపుణులు ఎవరైనా ఒంటరి కాకూడదు. ఏ సెక్టార్‌ చేత వెలివేయబడకూడదు.

పరిశ్రమ ఎదుర్కొంటోన్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి నిర్మాతలకు సహాయపడమని వివిధ వేదికల్లో ఎగ్జిబిటర్లకు మేం విజ్ఞప్తి చేశాం. ఇవాళ, ఎగ్జిబిటర్లు కేవలం విపరీతమైన డిమాండ్‌ ఉన్న సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్న, ఓ మాదిరి చిత్రాలను పట్టించుకోవడం లేదు. వాటిని విస్మరిస్తున్నారు. దాంతో చాలా చిత్రాలు వివిధ మార్గాల ద్వారా తమ పెట్టుబడిని రాబట్టుకుంటున్నాయి.

నిర్మాతల మనుగడను ఎవరూ / ఏ రంగమూ నిర్దేశించకూడదు. బెదిరించకూడదు.

పరిశ్రమ పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, వివిధ వ్యాపార భాగాస్వాములు.... పరస్పరం ఒకరిపై మరొకరు ఆధారపడిన పరిశ్రమ మనది. వ్యక్తిగతంగా, పరిశ్రమగా మనమంతా కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నాం. అన్ని సెక్టార్లు కష్టకాలంలో ఉన్నాయని మేం అర్థం చేసుకున్నాం. వారితో పాటు మేం బాధపడుతున్నాం. పరస్పన మద్దతు ఆశిస్తున్నాం. గతంలో మనం ఎదుర్కొన్న సమస్యలకు అందరం కలసికట్టుగా పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన సమయం వచ్చిందని మేం భావిస్తున్నాం.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం మనమంతా సమష్టిగా పని చేయాలి.


ఇట్లు,
యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌

More News

చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘త‌రం త‌రం స్థిరం చిరంజీవ‌..’ సాంగ్‌ను రూపొందించిన డైరెక్ట‌ర్స్ ర‌మేశ్ గోపి

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆదివారం(ఆగ‌స్ట్ 22). ఈ సంద‌ర్భంగా తెలుగు సినీ ప్రేక్ష‌కాభిమానులు మెగాస్టార్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొత్త చిత్రం 'శ్రీదేవి శోభ‌న్‌బాబు'

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు(ఆగ‌స్ట్ 22).. ఈ సంద‌ర్భంగా శ‌నివారం రోజున‌ గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల

ఆక‌ట్టుకుంటోన్న విశాల్‌, ఆర్య‌ల 'ఎనిమి' ఫ‌స్ట్ సింగిల్ 'ప‌డ‌దే..ప‌డ‌దే'

యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్యల క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎనిమి’.

ఆగ‌స్ట్ 23న 'మాస్ట్రో' ట్రైల‌ర్‌

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్టగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది.

హీరోగా బండ్ల గణేష్ , వెంకట్ చంద్ర దర్శకత్వంలో సినిమా ప్రారంభం

నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా మారుతున్నారు. ఆయన హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది.‌